జీవితమంటే కాలంలో కదలిక. - TopicsExpress



          

జీవితమంటే కాలంలో కదలిక. సయింటిస్టుకి నియమాలమీద సాగుతున్నట్లు కనిపిస్తుంది సృష్టి. ఆర్టిస్టుకి ఆ నియమాలలో రిధం- సంగీతం లో తాళంవలె గోచరిస్తుంది. చాలామంది ఆర్టిస్టులకి ఈ గానం తమ creative and inspired moments లోనే వినబడుతుంది. తన నిజజీవితానికీ తన స్వప్నవీధుల్లో గోచరించే సుందరానుభవానికీ - తను తాకే లోకానికీ తను భావించుకునే స్వర్గానికీ- ఈ వ్యత్యాసం బాదించటం వల్లనే ఆర్టిస్ట్ లో ఈ అశాంతి, ఈ అన్వేషణ , ఈ artistic expression, ఈ కల్పన. .......తాను ఏ నిమిషానో అందుకుంటున్న వెలుగుతో నీతినీ నిత్యజీవితాన్నీ వెలిగించుకునే ప్రయత్నం చెయ్యని ఆర్టిస్టు , కాయితం మీద ఎంత గొప్పవి కల్పించనీ -గొప్పవాడు కాడు. తన వేళ్ళు కల్పించే అందం, తన హృదయం లోకి ఇంకి, తన ముఖానికీ మాటకీ తేజాన్నివ్వాలి .......To live artistically is the highest art . చాలామంది ఆర్టిస్టులనబడని ఉత్తములలో జీవితమే కళకింద -సంసారం, సంభాషణ, వీటన్నిటిలోనూ సామరస్యం చూపడంలో వ్యక్తమవుతుంది. ఒక్కొక్కరిని చూడడం, వినడం- గొప్ప విగ్రహాల్నీ పటాల్నీ చూడడం కన్నా ఆనందం. వాళ్ళు మాట్లాడే విధం, వొస్తువుల్ని ఉపయోగించుకునే విధమే అన్నీ అందాలు. తమలోపల్నించి గొప్ప అందాల్ని చూపుతారు కొందరు ధన్యులు - చలం [ మ్యూజింగ్స్ ]
Posted on: Thu, 14 Aug 2014 17:59:21 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015