17 సెప్టెంబరు హైదరాబాదు - TopicsExpress



          

17 సెప్టెంబరు హైదరాబాదు సంస్థాన విమోచన దినమా, విలీన దినమా, విద్రోహ దినమా, దురాక్రమణ దినమా? [2] దురాక్రమణ దినం అనేది నిజాం నవాబు అనుంగు అనుయాయులు, కాశిం రజ్వీ అనుచర రజాకార్లు, లేక ఆ ప్రవృత్తి గలవాళ్లు, మన దేశంలో ముస్లిం మతరాజ్యం స్థాపించాలని, అలా స్థాపించగలమని ఆశించేవాళ్లు, కలలు కనే వాళ్లు చేసే ఆరోపణ. వాళ్లు అనేది ఏమంటే స్వాతంత్ర్యానికి ముందు, ఇంకా ఖచ్చితంగా చెబితే 17 సెప్టెంబరు 1948 కి ముందు నిజాం నవాబు ఒక సర్వసత్తాక అధికారాలు గల రాజ్యాధిపతి. ఒక్క విదేశీ వ్యవహారాలు, కొంతవరకు రక్షణ [డిఫెన్స్] వ్యవహారాలు తప్పితే బ్రిటిష్ పాలకుల హయాంలో కూడ తక్కిన అన్ని సర్వసత్తాక లక్షణాలు కలిగివుండిన అత్యున్నత మహా ప్రభువ [హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ - His Exalted Highness ]. ఒక ప్రత్యేక సైన్యం, ఒక చిన్న వైమానిక దళంతో సహా, కలిగివుండినాడు. ఇంకా తన సొంత నాణేలు ముద్రించుకునే అధికారం కూడ వుండింది. తన రాజ్యంలో తానే సర్వంసహాధికారి. ఆయన ఫర్మాన్‌లకు తిరుగు లేదు; అప్పీలు లేదు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్లు నిష్క్రమించ నిర్ణయించారో దానితో వారికి అంతదాకా వుండిన పారమౌంట్సీ [పరమాధిపత్యం అందామా?] కూడ అంతరించి పోయింది. ఈ పారమౌంట్సీని బ్రిటిష్ వాళ్లు ఇండియన్ యూనియన్ ప్రభుత్వానికి సంక్రమింపజేయలేదు; పైగా తాము నిష్క్రమించిన తర్వాత స్వదేశీ సంస్థానాలు ఒక విధంగా స్వతంత్రం అవుతాయనీ, కాని అవి అలా కొనసాగడం కంటే ఇటు ఇండియాలోనో, లేక పాకిస్తాన్‌లోనో చేరితే మంచిదనీ, కాని అంతిమ నిర్ణయం సంస్థానాధీశులదే నని స్పష్టం చేసారు కనుక, నిజాం నవాబు ఏ అధినివేశం [డొమినియన్] తోనూ చేర నిరాకరించి తన స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నాడు గనుక అప్పటినుండీ [అంటే 13-14 ఆగష్టు 1947 నుండీ] హైదరాబాదు సంస్థానం అన్ని హంగులుగల స్వతంత్ర రాజ్యం అయిపోయిందని వాళ్లు అంటారు. ఇంకా, నిజాం నవాబుతో హిందూదేశ ప్రభుత్వం కుదుర్చుకున్న స్థాయీసంబంధాల ఒప్పందం [లేక యథాస్థితి ఒప్పందం అనికూడ అంటారు - స్టాండ్‌స్టిల్ అగ్రిమెంటు ] ప్రకారంకూడ తనకు పరమాధిపత్య అధికారాలు వుండవని ఇండియా ప్రభుత్వం స్పష్టం చేసింది గనుక నిజాంను స్వతంత్ర రాజుగా పరిగణించే ఆ ఒప్పందం జరిగింది. అలాగే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం కూడదు, అందుకు సైన్యాల్ని పంపకూడదు అనే నిబంధన కూడ దానిలో వుంది, పైగా ఇదివరకు బ్రిటిష్ సైన్యాలు వుండడానికి సికిందరాబాదు కాంటన్‌మెంట్‌లో సర్వానుమతులుండినాయిగాని, ఇండియన్ సైన్యాన్ని మాత్రం అనుమతించలేదు. వీటన్నిటివల్ల హైదరాబాదు సర్వసత్తాక స్వతంత్ర రాజ్యమే. యథాస్థితి ఒప్పందాన్ని ఉల్లంఘించి సైన్యాన్ని పంపి ఆక్రమణ చేసింది కాబట్టి హిందూదేశ ప్రభుత్వం జరిపింది దురాక్రమణే అవుతుంది అని వాళ్లంటారు. బలవంతుడు బలహీనుడ్ని పీక్కు తినడాన్ని న్యాయం అని ఎలా అనగలం, ఓడిపోయినంత మాత్రాన నిజాం నవాబు ది అన్యాయం అని ఎలా అంటాం అని వాళ్లు నిలదీస్తారు. ఇక్కడే మనం ఇండియా ప్రభుత్వంతో నిజాం నవాబు కుదుర్చుకున్న స్థాయీసంబంధాల ఒప్పందం పాఠాన్ని (ఇంగ్లీషులో) చదువుదాము: STANDSTILL AGREEMENT BETWEEN INDIA AND HYDERABAD Agreement made this Twenty-ninth day of November Nineteen Hundred and Forty-seven [29 November 1947] between the Dominion of India and the Nizam of Hyderabad and Berar. Whereas it is the aim and policy of the Dominion of India and the Nizam of Hyderabad and Berar to work together in close association and amity for the mutual benefit of both, but a final agreement as to the form and nature of the relationship between them has not yet been reached; AND WHEREAS it is to the advantage of both parties that existing agreements and administrative arrangements in matters of common concern should, pending such final agreement as aforesaid, be continued: NOW THEREFORE, it is hereby agreed as follows:- Article 1. Until new agreements in this behalf are made, all agreements and adminitrative arrangements as to the the matter of common concern, including External Affairs, Defence and Communications, which were existing between the Crown and the Nizam immediately before the 15th August 1947 shall, in so far as may be appropriate, continue as between the Dominion of India (or any part thereof) and the Nizam. Nothing herein contained shall impose any obligation or confer any right on the Dominion:- (i) to send troops to assist the Nizam in the maintenance of internal order. (ii) to station troops in Hyderabad territory except in time of war and with the consent of the Nizam which will not be unreasonably withheld, any troops so stationed to be withdrawn from Hyderabad territory within 6 months of the termination of hostilities. Article 2. The Government of India and the Nizam agree for the better execution of the purposes of this Agreement to appoint Agents in Hyderabad and Delhi respectively, and to give every facility to them for the discharge of their functions. Article 3. (i) Nothing herein contained shall include or introduce paramountcy functions or create any paramountcy relationship. (ii) Nothing herein contained and nothing done in pursuance hereof shall be deemed to create in favour of either party any right continuing after the date of termination of this Agreement, and nothing herein contained and nothing done in pursuance hereof shall be deemed to derogate from any right which, but for this Agreement, would have been exercisable by either party to it after the date of termination hereof. Article 4. Any dispute arising out of this Agreement or out of agreements or arrangements hereby continued shall be referred to the arbitration of two arbitrators, one appointed by each of the parties, and an umpire appointed by those arbitrators. Article 5. This Agreement shall come into force at once and shall remain in force for a period of one year. In confirmation whereof the Governor General of India and the Nizam of Hyderbad and Berar have appended their signatures. MIR OSMAN ALI KHAN, Nizam of Hyderbad and Berar MOUNTBATTEN OF BURMA Governor-General of India దీనికి ప్రతిగా హిందూదేశ ప్రభుత్వం ఐక్య రాజ్య సమితిలో చేసిన వాదన ఇది: Hyderabad is not competent to bring any question before the Security Council; that it is not a State; that it is not independent; that never in all its history did it have the status of independence; that neither in the remote past nor before August 1947, nor under any declaration made by the United Kingdom, nor under any Act passed by the British Parliament, has it acquired the status of independence which would entitle to come in its own right to present a case before the Security Council… If, therefore, I deny the competence of any area to come before the Security Council on a matter like this, it is because my Government and I are convinced that if the Articles of the Charter are not properly read, appreciated and respected, if opportunity is given to any particular area which does not possess the characteristics of a State to lay what it considers its grievance before the Security Council, the utility of the United Nations will be considerably impaired and great damage will be done to the cause of peace itself. [సారీ, తెలుగు అనువాదం ఇవ్వలేక పోతున్నాము ఇప్పుడే...] ఇంకా ఇలా కూడ ఇండియా ప్రభుత్వం వాదించింది : ...the use of force by the Government of India was necessary; ‘to maintain law and order which had completely broken down in several parts of Hyderabad’. The decisive point was that the government of India considered the dispute as concerning a matter within the domestic jurisdiction of India; ‘we maintain the domestic character of the dispute. [సారీ, తెలుగు అనువాదం ఇవ్వలేక పోతున్నాము ఇప్పుడే...] మరి ఇండియా ప్రభుత్వం చేసిన వాదనలు సరియైనవేనా, న్యాయసమ్మతమైనవేనా, అలాగే నిజాం నవాబు తరఫున చేసే పై వాదనల్లో ఎంత సత్యం వున్నా వాటి లోగుట్టు ఏమిటో చారిత్రక పరిశీలనలో అవి ఎంతవరకు సవ్యమైనవో ప్రశ్నించవద్దా, ఒక సామంత రాజ్యం అని ఒక వైపు వొప్పుకుంటూనే, 1947కి పూర్వపు స్థితి [కొద్ది మార్పులు చేర్పులతో] కొనసాగాలని అంటూనే అందుకు భిన్నంగా వ్యవహరించడం క్షమార్హమేనా అనే కోణాలనుండి కూడ సవివరంగా పరిశీలించాల్సి వుంది. [అది రేపు ఇంకో తడవలో చేద్దాం...] [to be continued]
Posted on: Wed, 17 Sep 2014 18:53:27 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015