1835 ముందు ఇంగ్లాండ్ లో - TopicsExpress



          

1835 ముందు ఇంగ్లాండ్ లో అసలు సర్జరీ(Surgery) అంటే ఏమిటో తెలియదు. ఇంగ్లాండులో మొదటిసారి సర్జరీ గురించి చదువుకున్నది 1910/1911 లో ! కానీ హిందుస్తాన్లో వందల సంవత్సరాల ముందు నుండే సర్జరీ గురించి చదువుకుంటున్నారు. 1850 వరకు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటో ఇంగ్లాండుకు తెలియదు. కానీ హిందుస్తాన్లో ఎన్నో సంవత్సరాల ముందు నుండే ప్లాస్తిక్ సర్జరీ గురించి తెలుసు ! బ్రిటీషు ఆఫిసర్ అయిన కర్నల్ కూట్ అనే వ్యక్తి పబ్లిష్ చేసిన స్టేట్మెంట్(Statement) నా దగ్గర ఉంది. కర్నాల్ కూట్ దక్షిణ భారతంలో పెద్ద రాజు అయిన హైదర్ అలీతో పోరాడడానికి వచ్చాడు. కాని బ్రిటీషు వాళ్ళు హైదర్ అలీతో ఎప్పుడూ గెలవలేదు. హైదర్ అలీ అతనిని చంపకుండా ముక్కును కోసి ఇంగ్లాండుకు వెళ్ళినపుడు దాన్ని చూపించమని కర్నల్ కూట్కు చెప్పాడు. భారత దేశంలో ముక్కు కోయడం అంటే అర్థం అవమానం జరిగిందనడం ! అక్కడ నుండి పారిపోయి ఒక గ్రామానికి చేరిన కర్నల్ కూట్ని ఒక వ్యక్తి చూస్తాడు. ఎమైందని అడుగగా గాయం అయిందని కర్నల్ కూట్ అబద్ధం చెబుతాడు. అప్పుడు ఆ వ్యక్తి మా గ్రామంలో చికిత్స చేసే వైద్యుడు ఉన్నాడు అని చెప్పగా కర్నల్ కూట్ అతడితో వెళ్తాడు. ఒకటిన్నర గంట ఆపరేషన్ చేసి కర్నల్ ముక్కును సరిచేస్తాడు వైద్యుడు. తరువాత ఇంగ్లాండుకు వెళ్ళి పెద్ద సర్జన్ అయిన తన మిత్రుడితో చెప్తాడు నీకు ఏమి తెలిదు భారత దేశానికి వెళ్ళి చూడు సర్జరీ ఎలా చేస్తారో అని ! అలా అతను భారత్ కు వచ్చి 6/7 యేళ్ళు ఉండి సర్జరీ నేర్చుకుని వెళ్తాడు. అలా ఇంగ్లాండులో సర్జరీ గురించి తెలిసింది. ఈ విషయాన్ని కర్నల్ కూట్ స్వయంగా తన పుస్తకంలో వివరించాడు. కాని మనకి దీనికి విరుద్ధంగా భొదిస్తున్నారు. మనకి ఏది తెలిసినా బ్రిటీషు వారి వలనే లేకపోతే మనం అజ్ఞానులమని చెప్తున్నారు. మన దగ్గర నుండి బ్రిటీషు వాళ్ళు అన్నీ తెలుసుకుని వాటికి వారి ముద్ర వేసుకుని మనకి విరుద్ధంగా చెప్పి మేమే మీకు అన్నీ నేర్పించాం అని నమ్మించారు. -స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ Video link: youtube/watch?v=rcUaUfesoRE
Posted on: Tue, 02 Dec 2014 13:38:00 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015