A Dialogue in my New Story.. :P ;) ఏమంటివి..! - TopicsExpress



          

A Dialogue in my New Story.. :P ;) ఏమంటివి..! ఏమంటివి..??? బగ్గు నెపమున ఈ మ్రుదుపరికరణ నిపుణునికి (Software Professional) ఇంద కొలువు చేయుటకు అర్హత లేదందువా?? ఎంత మాట?? ఎంత మాట??? ఇది యూనిట్ టెస్టింగే (Unit Testing) కానీ యూసర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కాదే..! కాదూ..కాకూడదూ...ఇందు బగ్స్ రాకూడదు అందువా??? అయిన ఈ ప్రాజెక్ట్ లీడ్ కోడింగ్ ఎట్టిది?? అతి జుగుప్సాకరమైన నీ కోడింగ్ ఎట్టిది?? గూగుల్లో కాపీ కొట్టితివి కదా?...హ.హ.హ నీది ఏమి కోడింగు??? అంత ఏల?? మన కంపెనీ పితామహుడు , సాఫ్ట్ వేర్లో కురు వృద్దుడు అయిన మన సీఈఓ (CEO) బగ్గు ఫిక్సు చేయలేక పాత కంపెనీ నుండి పారిపోయి రాలేదా??? ఆయనదేమి కోడింగు??? హహహ...నాతో చెప్పింతువేమయ్యా??? ఈ కోడింగ్ మొదలు పెట్టిన నువ్వు వర్షన్ 1.1ని ..దాన్ని రివ్యూ చేసిన నీ టీయల్ వెర్షన్ 1.2ని అందులో బగ్స్ ఫిక్స్ చేసిన మన పీయల్ వెర్షన్ 1.3ని తయారు చేయలేదా??? సందర్భావసారాలని బట్టి, కాస్ట్ కట్టింగ్ ప్రాధాన్యంతో తయారైన మన కోడ్ ఏనాడో బగ్స్ పరమైనది..!! కాగ నేడు..బగ్గు బగ్గు అను ఈ వ్యర్ధవాదనలెందులకు..??? :P ;) :)
Posted on: Fri, 11 Apr 2014 14:18:33 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015