Ayn Rand-- పోరాట - TopicsExpress



          

Ayn Rand-- పోరాట మహిళ --------------------------------- ఒక బలమైన రచన చెయ్యాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ఒక బలమైన దార్శనికత అవసరం. పదునైన ఆలోచన, మరింత బలమైన తాత్వికత మాత్రమే ఓ గొప్ప రచనని అందించగలుగుతాయి. దానికి తార్కాణమే ఐన్ ర్యాండ్. నిష్పాక్షిక దృక్పథంతో రచనలు చెయ్యటమే కాకుండా వాస్తవికత (objectivism)నే ప్రధాన సాహితీ చింతనగా నవలలు రాసిన ఐన్ ర్యాండ్ ఓ సంచలనాత్మక రచయిత్రి. 1905 ఫిబ్రవరి రెండున రష్యాలో ఎలిసా జినోఎవ్నా రోజెన్‌‌బామ్ గా జన్మించిన ఈమె స్వతంత్రకళల పై మక్కువకొలదీ చిన్నప్పుడే పాఠశాల ఆసక్తికరంగా లేదని ఎనిమిదేళ్లకే స్క్రీన్ ప్లేస్ రాయటం, పదేళ్లకే నవలలు రాస్తానంటూ తన వివేచనసాక్తిని తండ్రికి ధైర్యంగా చెప్పింది. చెప్పదల్చుకున్న విషయాన్ని ముక్కుసూటిగా (ఈ క్రమంలో ముక్కెంత పగిలినా, ఐమీన్ ఎన్ని ప్రత్యనుకూల పరిస్థితులెదురైనా) పరిణామాలకి భయపడకుండా చెప్పగలిగే రచయితలెంతమంది మనలో? ముఖ్యంగా స్త్రీ రచయితలు? కమ్యూనిస్ట్ రష్యాలో పుట్టిపెరిగిన ఎలిసాకి అదే, ఐన్ ర్యాండ్ కి రష్యాలో ఇలా చెప్పటం వీలుకాకపోవచ్చు, తనని తాను మనసారా ఒలకబోసుకోడానికో, లేక తనకి నచ్చిన విషయాన్ని తనకి నచ్చిన పధ్ధతిలో చెప్పడానికో..... కానీ ఆమె ర్యాండ్. ఆమె దేనికీ వెనుదిరగదు. ఆఖరికి మన:ముండ నానికీనూ! ఆమె తనదైన పధ్దతిలో చెప్పదల్చుకున్న విషయాలన్నింటినీ చెప్పేతీరుతుంది. అదే ఐన్ ర్యాండ్. ఆమెకీ మతమంటే, దేవుడంటే సదుద్దేశ్యం లేదు. రాజ్యానికీ లేదు, ప్రభుత్వానికీ లేదు కదా, మరేంటీ గొడవ? కానీతనకి మతమంటే ఇష్టం లేదనీ, మతం గురించిన ఆమెకున్న నిర్ధుష్ట అభిప్రాయాలకి అక్కడ విలువలేదనీ గమనించడానికి, చెప్పటానికీ ఎక్కువ సేపు పట్టలేదు…… అందుకే ఆమె తన దేశాన్ని విడిచిపెట్టి మరీ వెళ్ళిపోయింది. తన వాళ్లనీ తీసుకెళ్లాలని అనుకున్నా అది వీసా సమస్య వల్ల వీలుకాలేదు. చివరికి ఆమె తనవాళ్లకి దూరంగానే ఉండిపోయింది అమెరికాలో.... ఒక్కోసారి ప్రదేశం బట్టి మనసు మారిపోతుందనుకుంటా. అప్పటివరకూ లేని భావుకత్వమో, భావావేశమో పొంగిపుర్లుతున్నప్పుడు ఇక ఆ ప్రదేశమే దేశం అయితే..... అదే మూలంకాదూ, కవిత్వానికీనూ, కవిత్వ ఆవేశానికీనూ...............అదే జరిగింది మన ఐన్ ర్యాండ్ విషయంలో కూడా..... ఆమెకి రష్యా ఓ కుబుసం. రాత్రి విడిచిన నైటీ కంటే ఎక్కువే. ఆమెకి తనదైన ఓ ఫిలాసఫీ...ఓ నిర్ధిష్ట అభిప్రాయామునూ! అప్పుడే ఆమె ఓ రెండు నవలలు రాసింది The Fountainhead and Atlas Shrugged అని ఈ రెండు నవలలూ ఆమెకి ప్రపంచఖ్యాతి నార్జించాయి. ఈరోజు ప్రపంచమంతా ఈ రెండు నవలలే చదువుతున్నారంటే అది అతిశయోక్తికాదు. కాదు మనమందరం కూడా ఈ నవలలు చదవాదిల్సిందే... ఒకటి The Fountain Head రెండు The Atlas shrugged ఇవన్నీ చదవండి. ఈమెని అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యండీ. ఈమె ఓ మహోదహుజ్ఞురాలు. ఈమె సంస్కరానికి మనమందరం చేతులు జోడిద్దాం. ఈమె ఫిలాసఫీకి మరీ చేతులెత్తి నమస్కరిద్దాం. ఈమె చెప్పిన మాటలనే ఓసారి చూద్దామా? ఉదాహరణగా ఇవి చూడండీ: 1. A creative man is motivated by the desire to achieve, not by the desire to beat others. ఓ సృజనాత్మక వ్యక్తి తనని తాను సాధించుకుంటాడు, ఇతరులని సాధించే కోర్కెని తనదిగా చేసుకోడు. 2. Money is only a tool. It will take you wherever you wish, but it will not replace you as the driver. డబ్బు కేవలం ఓ సాధనం మాత్రమే. అది నిన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తుంది కానీ అది మాత్రమే నీ చోదకుడు కాలేదు. 3. So you think that money is the root of all evil. Have you ever asked what is the root of all money? కోర్కెలన్నింటీకీ డబ్బే సమస్య అనుకుంటే మరి డబ్బే ఓ సమస్యా? అదే ఓ కోర్కె ఐతే మరి రూపాయిలకి వేరెక్కడ? కోర్కెకీ వేరెక్కడా? 4. The smallest minority on earth is the individual. Those who deny individual rights cannot claim to be defenders of minorities. ఈ భూమ్మీద అల్పసంఖ్యాక వర్గమంతా ఓ మనిషి. మరి ఈ మనిషి హక్కులని కాలరాసేవారంతా మనిషి మనుగడనే ప్రశ్నిస్తున్నారా? విచిత్రంగా? I am often asked whether I am primarily a novelist or a philosopher. The answer is: both. In a certain sense, every novelist is a philosopher, because one cannot present a picture of human existence without a philosophical framework. . . . In order to define, explain and present my concept of man, I had to become a philosopher in the specific meaning of the term. — Ayn Rand, “Preface,” For the New Intellectual నన్నెప్పుడు ఓ ప్రశ్న అడుగుతూంటారు అందరూ మీరు నవలా కారులా లేక తాత్వికవేత్తలా అని. దానికి నా సమాధానం ఒక్కటె. ప్రతి నవలాకారుడూ ఓ తాత్వికుడె. ఎందుకంటే ఓ మాములు వ్యక్తి ఎటువంటి తాత్వికచింతన లేకుండా తన జీవితాన్ని ప్రతిబింబించలేడు. ఓ మనిషిని నిర్వచించాలంటె నేను ఓ తాత్వికుణ్ణి కావాల్సిందే, మనిషిని తాత్వికంగా నిర్వచించాల్సి వచ్చినప్పుడు నేను కూడా ఓ ఫిలాసఫర్నావాల్సిందే కదా అని అంటూంది ఐన్ ర్యాండ్. మతం లేకుండా బతుకుదాం...మతం మన జివితాలని ప్రభావితం చెయ్యకుండా చేద్దాం..... మతానికతీతంగా బతుకుదామా? ఇలా...ఈమెలా? ఐన్ ర్యాండ్ లా? ప్రయత్నించి చూడండీ..ఈమె మనకి దూరం కాదు. ఒక బలమైన రచన చెయ్యాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ఒక బలమైన దార్శనికత అవసరం. పదునైన ఆలోచన, మరింత బలమైన తాత్వికత మాత్రమే ఓ గొప్ప రచనని అందించగలుగుతాయి. దానికి తార్కాణమే ఐన్ ర్యాండ్. నిష్పాక్షిక దృక్పథంతో రచనలు చెయ్యటమే కాకుండా వాస్తవికత (objectivism)నే ప్రధాన సాహితీ చింతనగా నవలలు రాసిన ఐన్ ర్యాండ్ ఓ సంచలనాత్మక రచయిత్రి. 1905 ఫిబ్రవరి రెండున రష్యాలో ఎలిసా జినోఎవ్నా రోజెన్‌‌బామ్ గా జన్మించిన ఈమె స్వతంత్రకళల పై మక్కువకొలదీ చిన్నప్పుడే పాఠశాల ఆసక్తికరంగా లేదని ఎనిమిదేళ్లకే స్క్రీన్ ప్లేస్ రాయటం, పదేళ్లకే నవలలు రాస్తానంటూ తన వివేచనసాక్తిని తండ్రికి ధైర్యంగా చెప్పింది. చెప్పదల్చుకున్న విషయాన్ని ముక్కుసూటిగా (ఈ క్రమంలో ముక్కెంత పగిలినా, ఐమీన్ ఎన్ని ప్రత్యనుకూల పరిస్థితులెదురైనా) పరిణామాలకి భయపడకుండా చెప్పగలిగే రచయితలెంతమంది మనలో? ముఖ్యంగా స్త్రీ రచయితలు? కమ్యూనిస్ట్ రష్యాలో పుట్టిపెరిగిన ఎలిసాకి అదే, ఐన్ ర్యాండ్ కి రష్యాలో ఇలా చెప్పటం వీలుకాకపోవచ్చు, తనని తాను మనసారా ఒలకబోసుకోడానికో, లేక తనకి నచ్చిన విషయాన్ని తనకి నచ్చిన పధ్ధతిలో చెప్పడానికో..... కానీ ఆమె ర్యాండ్. ఆమె దేనికీ వెనుదిరగదు. ఆఖరికి మన:ముండ నానికీనూ! ఆమె తనదైన పధ్దతిలో చెప్పదల్చుకున్న విషయాలన్నింటినీ చెప్పేతీరుతుంది. అదే ఐన్ ర్యాండ్. ఆమెకీ మతమంటే, దేవుడంటే సదుద్దేశ్యం లేదు. రాజ్యానికీ లేదు, ప్రభుత్వానికీ లేదు కదా, మరేంటీ గొడవ? కానీతనకి మతమంటే ఇష్టం లేదనీ, మతం గురించిన ఆమెకున్న నిర్ధుష్ట అభిప్రాయాలకి అక్కడ విలువలేదనీ గమనించడానికి, చెప్పటానికీ ఎక్కువ సేపు పట్టలేదు…… అందుకే ఆమె తన దేశాన్ని విడిచిపెట్టి మరీ వెళ్ళిపోయింది. తన వాళ్లనీ తీసుకెళ్లాలని అనుకున్నా అది వీసా సమస్య వల్ల వీలుకాలేదు. చివరికి ఆమె తనవాళ్లకి దూరంగానే ఉండిపోయింది అమెరికాలో.... ఒక్కోసారి ప్రదేశం బట్టి మనసు మారిపోతుందనుకుంటా. అప్పటివరకూ లేని భావుకత్వమో, భావావేశమో పొంగిపుర్లుతున్నప్పుడు ఇక ఆ ప్రదేశమే దేశం అయితే..... అదే మూలంకాదూ, కవిత్వానికీనూ, కవిత్వ ఆవేశానికీనూ...............అదే జరిగింది మన ఐన్ ర్యాండ్ విషయంలో కూడా..... ఆమెకి రష్యా ఓ కుబుసం. రాత్రి విడిచిన నైటీ కంటే ఎక్కువే. ఆమెకి తనదైన ఓ ఫిలాసఫీ...ఓ నిర్ధిష్ట అభిప్రాయామునూ! అప్పుడే ఆమె ఓ రెండు నవలలు రాసింది The Fountainhead and Atlas Shrugged అని ఈ రెండు నవలలూ ఆమెకి ప్రపంచఖ్యాతి నార్జించాయి. ఈరోజు ప్రపంచమంతా ఈ రెండు నవలలే చదువుతున్నారంటే అది అతిశయోక్తికాదు. కాదు మనమందరం కూడా ఈ నవలలు చదవాదిల్సిందే... ఒకటి The Fountain Head రెండు The Atlas shrugged ఇవన్నీ చదవండి. ఈమెని అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యండీ. ఈమె ఓ మహోదహుజ్ఞురాలు. ఈమె సంస్కరానికి మనమందరం చేతులు జోడిద్దాం. ఈమె ఫిలాసఫీకి మరీ చేతులెత్తి నమస్కరిద్దాం. ఈమె చెప్పిన మాటలనే ఓసారి చూద్దామా? ఉదాహరణగా ఇవి చూడండీ: 1. A creative man is motivated by the desire to achieve, not by the desire to beat others. ఓ సృజనాత్మక వ్యక్తి తనని తాను సాధించుకుంటాడు, ఇతరులని సాధించే కోర్కెని తనదిగా చేసుకోడు. 2. Money is only a tool. It will take you wherever you wish, but it will not replace you as the driver. డబ్బు కేవలం ఓ సాధనం మాత్రమే. అది నిన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తుంది కానీ అది మాత్రమే నీ చోదకుడు కాలేదు. 3. So you think that money is the root of all evil. Have you ever asked what is the root of all money? కోర్కెలన్నింటీకీ డబ్బే సమస్య అనుకుంటే మరి డబ్బే ఓ సమస్యా? అదే ఓ కోర్కె ఐతే మరి రూపాయిలకి వేరెక్కడ? కోర్కెకీ వేరెక్కడా? 4. The smallest minority on earth is the individual. Those who deny individual rights cannot claim to be defenders of minorities. ఈ భూమ్మీద అల్పసంఖ్యాక వర్గమంతా ఓ మనిషి. మరి ఈ మనిషి హక్కులని కాలరాసేవారంతా మనిషి మనుగడనే ప్రశ్నిస్తున్నారా? విచిత్రంగా? I am often asked whether I am primarily a novelist or a philosopher. The answer is: both. In a certain sense, every novelist is a philosopher, because one cannot present a picture of human existence without a philosophical framework. . . . In order to define, explain and present my concept of man, I had to become a philosopher in the specific meaning of the term. — Ayn Rand, “Preface,” For the New Intellectual నన్నెప్పుడు ఓ ప్రశ్న అడుగుతూంటారు అందరూ మీరు నవలా కారులా లేక తాత్వికవేత్తలా అని. దానికి నా సమాధానం ఒక్కటె. ప్రతి నవలాకారుడూ ఓ తాత్వికుడె. ఎందుకంటే ఓ మాములు వ్యక్తి ఎటువంటి తాత్వికచింతన లేకుండా తన జీవితాన్ని ప్రతిబింబించలేడు. ఓ మనిషిని నిర్వచించాలంటె నేను ఓ తాత్వికుణ్ణి కావాల్సిందే, మనిషిని తాత్వికంగా నిర్వచించాల్సి వచ్చినప్పుడు నేను కూడా ఓ ఫిలాసఫర్నావాల్సిందే కదా అని అంటూంది ఐన్ ర్యాండ్. మతం లేకుండా బతుకుదాం...మతం మన జివితాలని ప్రభావితం చెయ్యకుండా చేద్దాం..... మతానికతీతంగా బతుకుదామా? ఇలా...ఈమెలా? ఐన్ ర్యాండ్ లా? ప్రయత్నించి చూడండీ..ఈమె మనకి దూరం కాదు.
Posted on: Fri, 05 Sep 2014 19:26:22 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015