Good Morning Friends (): Please enjoy my below poetry on Alluri - TopicsExpress



          

Good Morning Friends (): Please enjoy my below poetry on Alluri Seetarama Raju (అల్లూరి సీతారామరాజు), which stood in 2nd place in yesterdays krishnaa tarangaalu poetic competition. స్వాతంత్ర్యసమరమునకు ఊపిరైన, ఆ మన్యవీరుడు మాన్య ధీరుడు! మొక్కోవని పోరాటపటిమ జూపి, రోమ్మువిఱచి ఆంగ్లదొరలనే ఎదురొడ్డి, దొమ్మి యుద్దము సల్పిన సమర శూరుడు! గూడెందొరల అండతో గాము సోదరుల చెలిమితో, ఈటె బళ్ళెం పదునుతో నాటు బాంబుల పోటుతో, ఆతని కళ్ళుచెదిరే గురితప్పని విల్లంబుల వాడితో, ఫిరంగీల గుండెలదిరి బెటాలియన్లే చెల్లా చెదురై, గుడాలు మేజరును బిడాలమునకే పారద్రోలె! మెరుపుదాడులతో ఠాణాలనే కొల్లగొట్టి, పోరాట వీరులను విడిపించి ఉద్యమబాట నడిపించి, వెట్టిచాకిరిని అణచి శిస్తుకప్పములను మాపి, రూథర్ఫర్డు తూటాలకు నేలరాలిన రక్తపు బొట్ట్టొకటియొక, సీతారామరాజు రూపుదాల్చుయని ప్రతినబూని నేలకొరిగె త్యాగశీలి!
Posted on: Thu, 27 Mar 2014 03:43:42 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015