Mistletoe/Viscum album: A Parasitic, Poisonous - TopicsExpress



          

Mistletoe/Viscum album: A Parasitic, Poisonous Plant...క్రిస్మస్ సమయంలో ముఖద్వారాలకి వేళాడదీసిన మొక్క క్రింద చుంబించుకునే ఒక ఆనవాయితీని అనుకోకుండా తెలుసుకున్నాను. ఎవ్విధమ్మున అందురా; ఏదైనా కళ్ళకి వేరుగా కనిపిస్తే ఊరుకోనివ్వని నా మిరియపు గింజ మెదడులోని పంపరపనస కాయంత కుతూహలం/వెఱ్ఱి కి ఇవాళ పుచ్చకాయ సైజుకి ఎదిగే అవకాశం కలిగించిన ఈ మిసల్టో కథ లోకి వెళ్దామా మరి!? నా కొత్త నివాసపు పెరట్లో చెట్టు మీద దర్శనమిచ్చిన ఈ గుబురైన కుదుర్లు మీద కాస్త అధ్యయనం చేయగా, ఆసక్తికరమైన నాలుగు ఊసులివి. గింజల ద్వారానే మెత్తని కాండాలు గలిగిన చెట్ల మీద ఎదిగే ఆ పరాన్నభుక్కు పేరు మిసల్టో. మన ప్రాంతాల్లో ఉండే కొన్ని ప్రాచీన నమ్మకాలు, చారిత్రక ఆధార/అనాధార గాథలు వీరికీ ఉంటాయి. ఫ్రిగ్గా అనే యూరోపియను దేవత కుమారుడైన బల్దర్ మరణానికి ఈ మొక్క నుంచి తయారైన ఆయుధం కారణమైనందున తదుపరి కాలంలో ఈ మొక్క ద్వారా ప్రేమ తప్పా పగ/మరణం సంభవించకూడదని ఈ ఆచారం మొదలైందట. అలాగే గ్రీకు పురాణాల ప్రకారం పవిత్రమైన/సంతానోత్పత్తి ని కలిగించేది గా ఆరాధించబడుతుంది. nonetheless, biologically it really is a fascinating, and unique, kind of plant. Interestingly, although we often think of “parasites” as being unwanted, studies have found that the presence of mistletoe plants actually improve the biodiversity around them. నిజానికి ఈ మొక్కల్లో చాలా రకాలున్నాయి. అన్నిటికీ కలిపి ఇది సాధారణ నామం.
Posted on: Mon, 10 Nov 2014 03:58:36 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015