Musings – 3 (June 28, 2013) దేవుడు లేడు - TopicsExpress



          

Musings – 3 (June 28, 2013) దేవుడు లేడు అంటే - దేవుడు అనే మానవాకారం గల వ్యక్తి ఆ చెప్పిన వాడికి, వాడి పరిమిత పరిధిలో ఎక్కడా కనపడలేదని అర్థం. అంచేత సత్య వాక్యంగా చెప్పాలంటే ఇలా చెప్పాలి. “చార్వాకుడనే ఆయనకి, దేవుడు ఇలా ఉంటాడని తాను ఊహించుకున్న వ్యక్తి, తాను తిరిగిన ప్రాంతంలో కనపడలేదు.” ఇది ఎవరూ ఖండించరు. బ్రహ్మ వస్తువు అంటే సమస్యలేదు. దానిని వర్ణించలేము. దానికి ద్రవ్యము (matter), గుణము (quality), కర్మ (action), సామాన్యము (general characteristics), విశేషము (special attributes), సమవాయము (inherence), మొదటి ఆరు లక్షణాలూ లేవు. ఇక్కడ అభావము పనికి వస్తుంది. అభావము అంటే ఏమీలేకపోవడం (absence). నిర్గుణం, నిరాకారం, నిరంజనం. కాబట్టి అది నిత్యము, సత్యము. ఆకాశానికి కొలతలేమిటి? బ్రహ్మము అంతే. నిజానికి సృష్టిలో మొదటిది పంచ భూతాలలో ఆకాశమే. యథార్థ జ్ఞానాన్ని సంపాదించడానికి కావలసిన రెండవ శాస్త్రము న్యాయ శాస్త్రము. గౌతముడు దీని ఋషి. రామాయణ కాలం నాటిది అయిఉండవచ్చు. గౌతముడు గోత్రకర్త. అనేక గౌతములున్నారు. న్యాయ సూత్ర కర్తను అక్షపాద గౌతముడు అంటారు. ఆయన సూత్ర గ్రంధంలో ప్రధమ సూత్రము ఇలా ఉంటుంది. ప్రమాణము, ప్రమేయము, సంశయము, ప్రయోజనము, దృష్టాన్తము, సిద్ధాన్తము, అవయవము , తర్కము, నిర్ణయము, వాదము, జల్పము, వితణ్డము, హేత్వాభాస, చలము, జాతి, నిగ్రహస్థానము అనే పదహారు విషయములను తెలుసుకోవడం వలన వలన గమ్యమునకు చేర్చే (మోక్షాన్నిచ్చే) యథార్థ జ్ఞానము లభిస్తుంది. ఈ న్యాయ శాస్త్రాన్ని సామాన్యంగా Indian logic అంటారు. కంప్యూటర్ సైన్స్ లో వాడే knowledge engineering అనే పదం ఎక్కువ తగినది అని నా అభిప్రాయం. న్యాయ తర్కాలు, వైశేషికం కలిపి ఒక తరహా ఆస్తిక దర్శనాలు. ఆస్తిక అనే పదానికి దేవుని ఉనికికి సంబంధములేదు. విశ్వము అనే నాటకములో దేవుని పాత్ర ఏమిటి? - ఇది కూడా ఆలోచింపవలసిన విషయము. All the world is a stage, all the men and women are players. అన్న షేక్స్పియర్ కథనానికి మనం కొంచెం చేర్చి Do not forget nature అని అనవచ్చును. నేటి హిమాలయ విలయంలో, హిమాలయ పర్వతాలు, గంగ, భాగీరథి, మందాకిని, అలకనంద నదుల ప్రముఖ పాత్రను కూడా స్మరించుకోవచ్చు. Nature is a component of God. దేవుడు అనే పదాన్ని, పదార్థాన్ని తెలుసుకుంటే "దేవుడులేడు" అన్నవాక్యం అజ్ఞానానికి పరాకాష్ఠ. "చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు".
Posted on: Fri, 28 Jun 2013 10:21:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015