OFF TOPIC : Plz Share This All are talking about Swetha Basu - TopicsExpress



          

OFF TOPIC : Plz Share This All are talking about Swetha Basu only.. But nobody asking the some other person (Male Candidate)... Where is the industrialist ? వాడు కూడా తప్పు చేసిన వాడే కదా ? మరి ఎందుకు ఈ పక్షపాతం ? మీడియా కూడా పదే పదే మహిళను చూపించడం కాదు... దమ్ము,ధైర్యం, సామాజిక భాద్యత ఉన్న ఏ ఛానల్ అయినా శ్వేతా బసు తో పట్టుబడిన విఠుడు (పారిశ్రామికవేత్త) ని బయటపెట్టండి.... బయట పెట్టలేని ఏ ఛానల్ అయిన మాకు సామాజిక భాద్యత లేదని ఒప్పుకునే సాహసం చేసి మీడియా రంగం నుండి వైదొలగండి... శ్వేతా బసు వ్యభిచారం.... ప్రపంచంలో మరే హాట్ టాపిక్ లేనట్టు....? 20 యేళ్ళ అమ్మాయి కూటి కోసం తన శరీరాన్ని అమ్ముకొంటోంది. అది ఆమె నైతికతకు సంబంధించిన వ్యక్తిగత అంశం. దీనికి ఫేస్ బుక్ లో, మీడియాలో.... ప్రపంచం మునిగిపోయింది అన్నంతగా ప్రచారం కల్పిస్తున్నారు! మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజాధనం కోట్లు కొల్లగొట్టిన వారిని, దొంగ నోట్లు ముద్రించి దేశ ఆర్థిక వ్యవస్టను నాశనం చేసిన వారిని, హంతకులను, వ్యభిచారులను ఓట్లు వేసి మరీ మన నాయకులుగా గెలిపించుకున్నాం. వారి గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం మనకు లేవు. కాని, సినిమా మాయా లోకం లో ఇరుక్కుని బయట బతక లేక, కాలేజీలో స్నేహితుల తో కేరింతలు కొట్టాల్సిన వయసులో తన శరీరాన్ని పుండులా చేసుకుంటున్న ఆమె స్థితిని చూసి జాలి పడాల్సింది పోయి. అదేదో ప్రపంచంలో అతి భయంకరమైన అపరాధం చేసినట్టు వేలెత్తి చూపుతున్నారు. ఆమె ఈ స్థితికి కారణమైన సినీ లోకాన్ని నిందించండి సినిమాలో ఆమె అందాలను ఆరబోయించి కోట్లు కూడబెట్టుకున్న వారిని ప్రశ్నించండి. వాడుకుని ఆ తర్వాత ఆమెకు అవకాశాలు లేకుండా చేసిన వారిని నిందించండి. సినీ మాయ ఎంతటి వారినయినా వ్యసనపరులు గా మార్చేస్తుంది. లోకం తెలియని మైనర్ బాలికలను దారి తప్పేలా చేస్తుంది. దీనికి కారకులు ఎవరు....???????????????????????.... వారిని తరమండి. ఇంకా ఇలాంటి ఎందరో అభాగ్యులు సినీ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నారు. హీరోలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నటీమణులు వ్యభిచారాన్ని ఆశ్రయిస్తున్నారు. పరిస్థితులు మారాలంటే ఎవరో ఒకరు అడుగు ముందుకు వెయ్యాలి ఇది నిజం కాదంటారా ?
Posted on: Thu, 04 Sep 2014 14:21:23 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015