Rejoice in the LORD - For the word of the LORD is right, and all - TopicsExpress



          

Rejoice in the LORD - For the word of the LORD is right, and all His works are done in truth. ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు. రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు. వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది. మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మికయుంచి యున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించు చున్నది.మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొను చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు. యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక.....ఆమేన్‌. Psalm : 33 1. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము... చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము. 1. Rejoice in the LORD, O ye righteous! For praise is comely for the upright. 2. సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఎఫెసీయులకు 5:19 2. Praise the LORD with the harp; sing unto Him with the psaltery and an instrument of ten strings. 3. ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ప్రకటన గ్రంథం 5:9, ప్రకటన గ్రంథం 14:3 3. Sing unto Him a new song; play skillfully with a loud noise. 4. యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది. 4. For the word of the LORD is right, and all His works are done in truth. 5. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది. 5. He loveth righteousness and judgment; the earth is full of the goodness of the LORD. 6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. హెబ్రీయులకు 1:14, హెబ్రీయులకు 11:3 6. By the word of the LORD were the heavens made, and all the host of them by the breath of His mouth. 7. సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. 7. He gathereth the waters of the sea together as a heap; He layeth up the deep in storehouses. 8. లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుప వలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను. 8. Let all the earth fear the LORD; let all the inhabitants of the world stand in awe of Him. 9. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. హెబ్రీయులకు 1:14, హెబ్రీయులకు 11:3 9. For He spoke, and it was done; He commanded, and it stood fast. 10. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును. 10. The LORD bringeth the counsel of the heathen to nought; He maketh the devices of the people of no effect. 11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. 11. The counsel of the LORD standeth for ever, the thoughts of His heart to all generations. 12. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. 12. Blessed is the nation whose God is the LORD, and the people whom He hath chosen for His own inheritance. 13. యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు. 13. The LORD looketh down from heaven; He beholdeth all of the sons of men. 14. తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు. 14. From the place of His habitation He looketh upon all the inhabitants of the earth; 15. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించు వాడు. 15. He fashioneth the hearts of all; He considereth all their works. 16. ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు. 16. No king is saved by the multitude of an army; a mighty man is not delivered by much strength. 17. రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు. 17. A horse is a vain thing for safety; neither shall he deliver any by his great strength. 18. వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును 18. Behold, the eye of the LORD is upon them that fear Him, upon them that hope in His mercy, 19. యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది. 19. to deliver their soul from death, and to keep them alive in famine. 20. మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మికయుంచి యున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించు చున్నది 20. Our soul waiteth for the LORD; He is our help and our shield. 21. మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొను చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు. 21. For our heart shall rejoice in Him, because we have trusted in His holy name. 22. యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక. 22. Let Thy mercy, O LORD, be upon us, according as we hope in Thee. GOD BLESS YOU...
Posted on: Thu, 12 Sep 2013 08:07:29 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015