The response to my translation of Maya Angelous Still I Rise is - TopicsExpress



          

The response to my translation of Maya Angelous Still I Rise is overwhelming. I am really humbled by so many shares, likes and comments. Particularly friends like Vadrevu Ch Veerabhadrudu, Umamaheswara Rao C, and Afsar Afsar, whose insight and sensitivity I respect a lot, appreciated the translation and I am really grateful. I would like to take this occasion to share when and how I translated this poem as well as another poem by Pablo Neruda. I was introduced to the great poetry of Maya Angelou by my friend C V Subba Rao some time in the late 1970s or early 1980s. I still remember reading this poem at that time. Those days I was translating at least half a dozen poems a month and in that spree, I wanted to translate this also. But I realised it is not just a poem of words, it is a poem of spirit. The poem stayed with me for the next thirty years and in 2009-10 circumstances forced me to translate the poem. Due to a blunder I committed then, so many friends and comrades of mine were writing me down in history with their bitter, twisted lies and turning their face away from me. Then I got the spirit of this poem to say Still I rise and the translation was easier. Similarly I read Pablo Nerudas Tonight I can write in 1981-82 and was struggling to translate it for the last three decades. I could translate that poem also along with Still I rise. I sent both the translations to Kavitaa but somehow they published Maya Anglous poem and did not take Nerudas. Its still unpublished. Here I am sharing it for the first time.... రాయగలను నేనీరాత్రి పాబ్లో నెరూడా రాయగలను నేనీరాత్రి ఒక చేదుపాట పాడగలను నేనీ కరాళరాత్రి శోకగీతి ఇవాళ నా అక్షరాలనిండా తొణికిసలాడే కన్నీళ్లు ఏమి రాస్తానా? వినండి ఉదాహరణకు: ‘`మిలమిల మెరిసే చుక్కలు నిండిన నింగి అనంత దూరాన నీలినీలి వెలుగుల తారలు’ ఈ చీకటి ఆకాశపు గాలి గిరికీలు కొడుతూ పాడుతున్న పాట రాయగలను నేనీరాత్రి ఒక చేదుపాట నేనామెను ప్రేమించాను, కొన్నిసార్లు నన్నూ ఆమె ప్రేమించింది ఇటువంటి అనేకానేక రాత్రులలో నా కౌగిలిలో ఆమె కౌగిలిలో నేను అనంతాకాశపు కప్పుకింద ఆమెపై కురిసిన ముద్దులేముద్దులు ఆమె నన్ను ప్రేమించింది, కొన్నిసార్లు నేనూ ఆమెను ప్రేమించాను అయినా ఆ అద్భుత నిశ్చల నేత్రాలను ప్రేమించకుండా ఎవడుండగలడు పాడగలను నేనీరాత్రి ఒక చేదుపాట ఆమె నాతో లేదని చెప్పే పాట నేనామెను కోల్పోయానని చూపే పాట అసలే గడ్డకట్టిన చీకటి రాత్రి ఆమె లేక మరింత చిక్కబడిన గాఢాంధకార రాత్రి ఇక మంచుబిందువులు గడ్డిపరకలమీద రాలినట్టు చేదుపాట నాలోంచి వెలువడుతుంది నా ప్రేమ ఆమెను నాతో ఉంచలేకపోయిందంటే ఏం లెక్క ఆకాశంలో చుక్కలు నిండాయి ఆమె నన్ను వదిలి వెళిపోయింది అంతే. సుదూరాన ఎవరో పాడుతున్నారు. అందనంత దూరాన. ఆమెను పోగొట్టుకున్న నా ఆత్మ అనంత దుఃఖాన్ని పాడుతోంది. ఆమెను నా దగ్గరికి లాక్కోవాలని నా చూపులు చుట్టూ తడుముకుంటాయి నా హృదయం ఆమెకోసం వెతుకులాడుతుంది. ఆమె మాత్రం నాతో లేదు అటువంటిదే ఈ రాత్రి. అప్పటిలాగే వృక్షాలను వెలిగించే మసక వెన్నెల కాని, అప్పటికాలానికి చెందిన మేం మాత్రం అప్పటిలా లేం నేనింకెంతమాత్రమూ ఆమెను ప్రేమించడం లేదు అది నిశ్చితం కానీ నేనామెను ఎంత ప్రేమించాను ఆమె వినే గాలిని స్పృశిద్దామని నా గొంతు తహతహలాడేది మరొకరిది. ఆమె మరొకరిదయిపోయింది. నా ముద్దులకు ముందులాగ ఆమె సవ్వడీ ఆమె మెరిసిపోయే దేహమూ ఆమె నిగూఢమైన కళ్లూ నేనింకెంతమాత్రమూ ఆమెను ప్రేమించడం లేదు అది నిశ్చితమే కానీ నేనామెను ప్రేమించగలిగితే ఎంత బాగుండును ప్రేమ ఎంత స్వల్పం, మరపు ఎంత దీర్ఘం ఇటువంటి రాత్రులలోనే నేనామెను పొదివి పట్టుకున్నాను గనుక ఆమెను కోల్పోయానంటే నా హృదయం అంగీకరించడం లేదు ఆమె నా హృదయానికి చేయగల ఆఖరి గాయం ఇదే ఆమె కోసం నే రాయగల ఆఖరి గేయమూ ఇదే (అనువాదం చేద్దామని ముప్పై సంవత్సరాలుగా అనుకుంటూ ప్రయత్నిస్తూ శక్తి చాలదని ఆగిపోతూ ఉన్న పాబ్లో నెరూడా సుప్రసిద్ధ కవిత ‘టునైట్ ఐ కెన్ రైట్’ కు సరిగ్గా అటువంటి ఆఖరి గేయం తరలివచ్చిన క్షణాన అనుసరణ – ఎన్. వేణుగోపాల్ - అక్టోబర్ 6, 2010)
Posted on: Sun, 01 Jun 2014 06:25:27 +0000

Trending Topics




© 2015