They Howl-Me Holler! మల్లాది - TopicsExpress



          

They Howl-Me Holler! మల్లాది నత్తలొస్తున్నాయి జాగ్రత్త తీరుగా నేనూ కాయొటీస్(ఒక విధమైన తోడేలు) వచ్చేసాయి బాబోయ్! అనాల్సి వస్తుందని ఊహిస్తినా ఎన్నడైనా!? కానీ, ఇప్పుడు baseball bat పుచ్చుకుని నా కుక్క కి పహారా కాస్తున్నాను. నవ్వొద్దు కానీ, కయొటీని భ్రమలో పట్టి భయపెట్టి పారద్రోలటానికి 85 డాలర్లు పోసి తోడేలు మూత్రం కొంటున్నాము. దాన్ని కంచె వెంటా కళ్ళాపి జల్లటం వలన అమ్మోయ్ నాకన్న పెద్ద శత్రువు ఉంది ఇక్కడ అని ఈ చిన్న ప్రమాదం పారిపోతుంది(గా)! మరి కొన్ని జాగరూకతల పట్ల అవగాహన పెంచుకుంటున్నా. ఎందుకంటే, మొన్న రాత్రి రెండు తోడేళ్ళ గుంపుల మధ్య మా ఇంటి వెనుక గోడ కి సమీపం లో territory marking విషయమై కాస్త ఘర్షణ జరిగింది. అలా అలా ఆసక్తికరమైన అంశాలు తెలిసాయి. అందులో కొన్ని: 1) Coyote మరీ wild wolf కాదు. జనావాసాలకి దగ్గరగా మెసులుతుంది 2) నిజానికి కయొటీ తోడేలు కన్నా Canaan జాతి కి చెందింది, అంటే కుక్కలకి దగ్గరి జీవి+ మచ్చిక అవుతుంది పెంపుడు జంతువుగా 3) కాకపోతే ఈ మూడూ ఆహార విషయమై ఒకే resources మీద ఆధారపడతాయి కనుక వాటిల్లో inferior and superior వర్గీకరణ జరుగుతుంది (మనలోని బలవంతుడు బలహీనుడు విభజన లా) 4) సహజంగానే బలమైన exploiter ఈ వ్యవహారాల్లో interference కి అనగా కయ్యానికి కాలు దువ్వుతుంది 5) ఇక లోపలికి వెళితే వాటిల్లో వాటికే గుంపుల మధ్య జగడాలు జరుగుతాయి, సరిహద్దులు మీరి చొచ్చుకువస్తే మరి, మనుషులం యేమి చెయ్యాలంటే కుక్కల్ని మచ్చిక చేసుకుని పెంపుడుకి తీసుకుంటే (వీధి కుక్కలకి వాటి రక్షణ వాటిదే), కాపాడుకునే బాధ్యత మనది కనుక కాయొటీ నుంచి తేలిగ్గానే కాపాడవచ్చు - flash lights, cattle prod వంటి పరికరాలతో. ఇది మనుషుల జోలికి రాని పిరికి జీవి. తోడేళు విషయమై జాగ్రత్త పడాలి; దానికి ఆకలి వెస్తే మనిషీ ఆహారమే కనుక మన జాగ్రత్తలో మనం ఉండి అవి సంచరించే చోటకి వెళ్ళకూడదు. అది వస్తే ఎదుర్కునే సన్నాహాలు చెయ్యాలి. ఇక మన పంచతంత్రం లా ఇక్కడా చాలా fairy tales ఉంతాయి. ప్రస్తుతం ఈ ఫెయిరీ ఆ వాల్వరిన్ కథ చదువుతున్నా. పంచాలని బుధ్ధి కలిగితే మళ్ళీ కూసిని కబుర్లు! (added in here are my clicks of 1. Coyote, 2,3. Our pets (a Canaan dog and a cross breed dog of wolf and Alaskan malamute and 4. a doll at friends place of fairy and wolverine)
Posted on: Wed, 03 Dec 2014 02:14:39 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015