waiting for MAHATMA. నమో,నమో జపం - TopicsExpress



          

waiting for MAHATMA. నమో,నమో జపం అయిపోయింది,ఇక ఇప్పుడేమో mom,mom అంటూ కలవరిస్తున్నారందరూ.ఏ,నీకు మాత్రం ఆనందంగా లేదా ప్రపంచంలో అతికొద్ది దేశాలు సాధించిన విజయం కదా ఇది అంటారా?అవును నాకూ ఎంతో ఆనందమే. అప్పట్లో USSR సహకారంతో 1975 లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రోదసి లోకి పంపించగలిగాము.అంతేనా అప్పటి రెండు రూపాయల నోట్ల మీద ఆ ఉపగ్రహం బొమ్మలను ఇంకా మరచిపోలేదు.ఇక ఈ 40 సంవత్సరాల్లో మన ISRO వాళ్ళు అనేక ఘన విజయాలు సాధించారు. ముఖ్యంగా అప్పట్లో cryogenic technology ని అందివ్వడానికి ఎవరూ ముందుకు రాకపోయినా మన వాళ్ళ మేధ తోనే దాన్ని సాధించాము. అంతేనా... ఒకప్పుడు సూపర్ కంప్యూటర్ ను కొందామన్నా చీ కొట్టారు అమెరికన్స్.మన వాళ్ళు c-dac అనే సంస్థ స్థాపించి పరం 8000 అనేదాన్ని సాధించారు. ఇంకా అంతేనా మన మాజీ రాష్ట్రపతి,భారతరత్న అబ్దుల్ కలాం సారధ్యంలో మన సాధించిన missile technology ఒక అధ్బుతం. ఇట్లాంటి విజయాలు ఎన్నో,ఎన్నెన్నో మనం స్వయంగా సాధించాము. ఇక నీ ఏడుపెందుకు? అంటున్నారా....మరి ఈలోగా ఏమి తొందరొచ్చిందనో gatt వగైరాలంటూ సరళీకృత ఆర్ధిక విధానాలు,ప్రపంచీకరణ అని సంతకాలు చేసి కూర్చున్నాం. ఉపగ్రహ వ్యవస్థ మనది,సెల్ ఫొన్లు అమ్ముకునేది విదేశీయులు.నిన్నటి దాకా కళకళ లాడిన ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత.ఈ దేశంలో సామాన్యుడూ వాచీ పెట్టుకోగలిగిన hmt వాచీలు మాయం,పల్లెల్లో లక్షలాది మంది కి జీవనాధారమైన పాడి పరిశ్రమ నాశనం.అంతేనా ప్రతి దిక్కు మాలిన రంగం లో విదేశీ పెట్టుబడులు.స్టాక్ మార్కెట్ల లొ వచ్చారు,అమాంతం షేర్ వాల్యూ పెంచడం జనాల కొంపముంచడం.ఆ కొంపలు అక్కడికే మునిగాయా?sez,indusrial corridor లంటూ పల్లెలకు పల్లెలు మింగటం,పర్యావరణ విధ్వంసం,బొగ్గు,బాక్సైట్,ఇనుము .....సహజవనరుల విశృంఖల దోపిడీ. నా తప్పేముంది?చైనా ఒలంపిక్స్ నిర్మాణాలకు కు ఇనుపఖనిజం సరఫరా చేసి సంపాదించిన్నాఅంటాడు గాలి బాబు.ఇక ఒడిషా లో పోస్కొ,మన అరకులో బాక్సైట్ ల కథ రోజూ చదివి తరిస్తూనే ఉన్నాము.కోల్గేట్ స్కాంలు,మరో పక్క ప్రమోద్ మహాజన్,కనిమొళి,రాజా ల వేల కోట్ల టెలికాం స్కాములు తప్ప సాధిస్తున్నదేమి? ఇంతోసి పరాయి కంపెనీల చేతుల్లో దేశాన్ని పెట్టేందుకు ఈ పాలకులు కావాలా?ఇక గాంధిజీ సహాయ నిరాకరణొద్యమాలకు,విదేశీ వస్తు బహిష్కారాలకు విలువేంటి?వాటి అర్ధం,పరమార్ధం ఏముంది? ఇక నమో వచ్చిన రెండు నెలల్లోనే రక్షణ,రైల్వేల్లో కూడా విదేశీ పెట్టుబడులనేసాడు.(అవును గాలి బాబుతో ఏటా ఒడిబియ్యం పోయించుకునే సుష్మక్క అక్కడే ఉందిగా!) నిన్నేమో మన నమో గారు make in india అంట.దీని emblem ఒక సింహం.ఇంకేం విదేశీయుల్లారా రండి సింహంలా తినెయ్యండి మా వనరులను .మీ దిక్కుమాలిన వ్యాపార ప్రయోజనాలకు,ప్రయోగాలకూ మా గొర్రెల్లాంటి ప్రజలు అడ్డు చెప్పకుండా మేము కాచుకుంటము.మిమ్మల్ని కంటి రెప్పలా కాపాడుకుంటాము,కావాలంటే చూడండి 30 ఏళ్ళైనా అతీగతీ లేని union carbide ఉందిగా అనేమో.అంతేనా ఎంతగొప్పోడొ ఆ నాటి వాస్కోడిగామా ను గుర్తు తెచ్చ్హుకున్నాడు.నిజమే కదా ఆ వాస్కోడిగామా తర్వాత డచ్చి,ఫ్రెంచ్,బ్రిటిష్ వాళ్ళంతా వచ్చి బానిసలుగా మనలను చేసారు.నమో గారి make సంగతేమో కానీ వీళ్ళందరూ ఏకు లా వచ్చి మేకు లా తయారయినవారే!అందుకేగా స్వాతంత్ర్య పోరాటం చేసింది? ప్రజలు ఇవి మాకొద్దు బాబోయ్ అని ఎంత గింజుకున్నా ఆలకించే వారేరి?ఎందుకు ఆలకించాలి మనమంతా నాలుగు రూపాయలకు అమ్ముడు పోయి వ్యాపారస్థులను ప్రతినిధులుగా ఎన్నుకున్నోళ్ళమే కదా!!! ఎక్కడున్నావయ్యా,మహాత్మా ! నీ కోసం ఎదురు చూస్తున్నాము.
Posted on: Fri, 26 Sep 2014 06:24:12 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015