అమ్మ నాన్నలకు తమ - TopicsExpress



          

అమ్మ నాన్నలకు తమ పిల్లలపై ఎనలేని ప్రేమ ఉంటుంది... కానీ కొందరు దానిని బయట పడనివ్వరు.. దానిని పిల్లలు తప్పుగా అర్దం చేసుకుంటుంటారు.. చిన్న ఉదా: ఒకరోజు ఒక షాపుకు వెళ్ళాను.. అంతలోఆ షాపు యజమాని కొడుకు వచ్చాడు.. ఇక అతను ఆ పిల్లాడిని తిట్టడం ప్రారంభించాడు.. అసలు అయితే నువ్వు భూమికి భారం అనికూడా అన్నాడు... నాకైతే ఏమీ అర్దం కాలేదు.. ఆ పిల్లాడు ఏడుస్తూ వెళ్లిపొయ్యాడు.. అబ్బాయి వెళ్ళగానే పక్కనున్న తన భార్యతో"పాపం టిఫిన్ అయినా చేసాడా లేదా?"అని అడిగాడు... తర్వాత పిల్లాడిపై ఉన్న ప్రేమ ఆయన మాటల్లో నాకు కనిపించింది.. మరి అంత ప్రేమ ఉండి ఎందుకలా తిట్టాడు అనుకున్నాను.. ఆ పిల్లాడు చెప్పిన మాట వినకుండా సరిగా చదవడం లేదు అంట... ఇక్కడ ప్రేమ లేకపోవడం లేదా తక్కువ, ఎక్కువ ఉండడం అన్న ప్రశ్నే లేదు... కానీ దాన్ని వ్యక్తపరుస్తున్న విధానంలో తేడా ఉంది.. పెద్దలు కూడా కాస్త చెప్పవలసిన విధంగా చెప్తే పిల్లలు మారుతారు.. అంతే కానీ అలా తిడితే పిల్లల మనసు గాయపడుతుంది.. పెద్దలు ఈ విషయం కాస్త అర్దం చేసుకోంటే బాగుణ్ణు... కానీ ఒక్కటే ప్రేమలో మాత్రం మార్పు ఉండదు... ప్రేమ అంటే ఎప్పుడూ వ్యక్త పరుస్తుండాల్సినఅవసరం లేదు... అవసరం అయినపుడు అది బయటపడుతుంది.. ప్రేమ అని మెదలెట్టాను కదా కాస్త చేప్తాల్సిందే... ప్రేమలో కపట ప్రేమ, నిజమైన ప్రేమ అని రెండు రకాలు ఉంటాయి... కపట ప్రేమ అనేది మనపై ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది... అలాంటి కపటప్రేమ కలిగినవారు ఎలా ఉంటారంటే .. మీరు ఏం చేస్తున్నా అందులో అవసరం లేకపోయినా ఏదో ప్రయోజనం కోసం సాయం చేస్తూ ఉంటారు.... కానీ మనపై నిజమైన ప్రేమ ఉన్నవారు మనం కష్టంలో ఉన్నప్పుడు మీరు అడకుండానే సాయం చేస్తారు, అవసరమైతే ప్రాణం అయినాఇస్తారు.... అలాంటి నిజమైన ప్రేమ కలిగినవారు మీ చుట్టూ వుంటూ మిమ్మల్ని తిడుతూనే ఉండచ్చు... కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే వారిలోని నిజమైన ప్రేమ బయటపడుతుంది..... కాబట్టి నిజమైన ప్రేమను కురిపిస్తున్న వాళ్ళను గమనించండి.. అమ్మా నాన్నలను తప్పుగా అర్దం చేసుకోవద్దు.... HaPPy ParENts dAy tO Allllll OF oUr ParENts...
Posted on: Sun, 28 Jul 2013 10:24:05 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015