ఆంధ్రాలో రాజ‌ధాని - TopicsExpress



          

ఆంధ్రాలో రాజ‌ధాని నిర్మాణానికి 10 ఏళ్లు చాల‌దు..! అందుకే రాయ‌ల‌సీమ‌లో రాజ‌ధానిని నిర్మించాలి..!! 10 ఏళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం సాధ్య‌మా? అంటూ ఆంద్రోళ్లు ఈ మ‌ధ్య ప‌దేప‌దే ప్ర‌శ్నిస్తున్నారు.. ఏమ‌న్న అంటే బీడీఎల్‌, డీఆర్‌డీఎల్‌, ఎన్ఐఎన్‌ త‌దిత‌ర జాతీయ సంస్థ‌ల ఏర్పాటు 10 ఏళ్ల‌లో జ‌రుగుతుందా? అంటూ నిల‌దీస్తున్నారు.. అస‌లు రాజ‌ధానికి కావాల్సింది స‌చివాల‌యం, ఉద్యోగుల కోసం కార్యాల‌యాలు, అసెంబ్లీ, ఎయిర్‌పోర్టు త‌దిత‌ర మౌలిక‌ వ‌స‌తులు క‌దా.. ఇవి చూసే క‌దా ఆంధ్రోళ్లు క‌ర్నూల్‌ను వ‌దులుకొని ప‌రుగుప‌రుగున వ‌చ్చింది.. వీటిని 10 ఏళ్ల‌లో క‌ట్ట‌లేరా? ముమ్మాటికీ క‌ట్టొచ్చు.. ఇంకా హైటెక్ సిటీ కూడా క‌ట్టొచ్చు.. ఎందుకంటే నాగార్జున సాగ‌ర్‌, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, దేశంలో ల‌క్ష‌ల‌ కిలోమీట‌ర్ల రోడ్ల నిర్మాణం చేసిన అనుభ‌వం ఆంధ్రోళ్ల సొంతం.. కానీ ఆంధ్రోళ్ల మ‌న‌సులో మ‌రో భ‌యం ఉంది.. అది చెప్పుకోడానికి సిగ్గుప‌డుతున్న‌ట్లు స‌మాచారం.. పాపం ఆంధ్రా ప్రాంతంలో సంవ‌త్స‌రానికి రెండుసార్లు తుఫాన్లు వ‌స్తాయాయే.. రాజ‌ధాని నిర్మాణం చేప‌డితే సంవ‌త్స‌రంలో రెండుసార్లు కొట్టుకుపోతూ ఉంటుంది.. ఇలా అయితే 10 ఏళ్ల‌లో ఎలా క‌ట్టుకుంటాం అని వాళ్లు లోలోన మ‌థ‌న‌ ప‌డుతున్నార‌ని నా మిత్రుడు నాతో అన్నాడు.. నిజ‌మే ఆంధ్రాలో వ‌ర‌దొస్తే అన్నీ ఊడ్చిపెట్టుకుపోవాల్సిందే.. కేంద్రం సాయం చేయ‌క‌పోతే బ‌తుకు సాగ‌దాయే.. మ‌ళ్లీ కూటికి గ‌తిలేని తెలంగాణోళ్లే విరాళాలు వ‌సూలు చేసి ఆంధ్రాకు పంపించాల్సిన దుస్థితి ఉందాయే.. స‌మ‌స్య‌ను చెప్పుకుంటే ప‌రిష్కారాన్ని సూచించొచ్చు.. ఇలాంటి ప‌రిస్థితుల్లో నేను ఒక ప్ర‌తిపాద‌న‌ చేశాను.. రాయ‌ల‌సీమ‌ ఆంధ్రాప్రాంత రాజ‌ధాని నిర్మాణానికి అనువైన ప్రాంత‌మని సూచిస్తున్నా.... లేనిపక్షంలో వేస‌విలో ఒక ప్రాంతం, వ‌ర్షాకాలంలో మ‌రోప్రాంతాన్ని రాజ‌ధానిగా ఉప‌యోగించుకుంటే కష్టాలు తొల‌గిపోతాయి.. ఈ చిన్న విష‌యానికి బాబుగారు, జ‌గ‌న్‌గారు బెంగ పెట్టుకుని దీక్ష‌లు చేస్తూ మ‌ధ్య మ‌ధ్య‌లో బ్రేక్‌లు తీసుకుంటుండ‌టం న‌న్ను తీవ్రంగా క‌లిచివేస్తోంది సుమా.. అందుకే ఈ ఉచిత స‌ల‌హా..
Posted on: Wed, 09 Oct 2013 18:27:28 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015