ఇటు నేను, అటు ఓ కుక్క , - TopicsExpress



          

ఇటు నేను, అటు ఓ కుక్క , మధ్యలో పంది పిల్ల.. ఎందుకనో గానీ నాకు ఓ 10, 12 సంవత్సరాల వయస్సు నుంచీ కుక్కలంటే విపరీతమైన భయం ఉండేది. ఎక్కడ కుక్కలు కనబడ్డా వాటికి చాలా దూరంగా వెళ్ళిపోయేవాడిని. లేదంటే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ వెనుకాల వెళ్ళి దాక్కునేవాడిని.మొదట్లో ఫ్రండ్సెవరికీ తెలీకుండా manage చేసేవాడిని కానీ , తరువాత నా భయం సంగతి అందరికీ తెలిసి ఆట పట్టించేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరికీ I am not scared of even African Lions, but I am afraid of these village lions అని చాలా బింకంగా సమాధానం చెప్పేవాడిని. B.Tech చదువుతున్న రోజుల్లో, ఓ సారి రాత్రి 10 గంటలకు అనుకుంటా, మా friends room నుంచీ మా room కి ఒక్కడినే వెళ్ళుతు న్నా. ఆ street అంతా నిర్మానుష్యంగానూ, నిశ్శబ్ధంగానూ ఉంది. రాత్రి కదా, పెద్దగా lights కూడా లేవు. ఈలోపున ఓ కుక్క ఎదురుపడి, నన్ను చూసి మొరగడం మొదలుపెటింది. నాకు పై ప్రాణాలు పైనే పోయినట్టైంది. పరిగెత్తితే ఎక్కడ నా పిక్క పట్టుకుంటుందేమోనని భయం. పోనీ ఎవరి వెనుకాలైన దాక్కుందామటే ఎవరూ లేరు. తిరిగి, ఓ ఇరవై, ముప్పై అడుగుల దూరంలో ఉన్న మా friends room కి వెళ్ళిపోదామనుకుంటే, వాళ్ళు విషయం కనుక్కునేసి ఆట పట్టిస్తారేమోనని భయం. ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు. మెల్లగా ఒక్కో అడుగు వెనుకకు వేస్తూ వెళ్ళుతున్నా, ఆ కుక్క కూడా సింహంలా ఫోజు కొడుతూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తోంది నా వైపుకు. ఇంతలో ఎక్కడ నుం చి వచ్చిందో కానీ ఓ పంది పిల్ల మా మధ్యలోకి enter అయ్యింది. ఈ లోపున ఆ కుక్క attention నా మీద నుం చి పంది పిల్ల మీదకు ఫోకస్ అయ్యి, దాన్ని చూసి మళ్ళీ మొరగడం మొదలుపెట్టింది. హమ్మయ్యా .. బ్రతుకు జీవుడా... ఈ పంది పిల్ల వచ్చి నన్ను save చేసిందిరా స్వామీ అనుకుంటూ, దానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నా. కానీ ఇంతలో ఈ పందిపిల్ల కూడా ఆ కుక్కను చూసి బాగా భయపడి పరిగెత్తడం మొదలు పెట్టింది. సరే.. ఆ పంది పిల్ల ఇంకో direction లో పరిగెత్తి ఉంటే నాకు అసలు సమస్యే అయ్యుండేది కాదు. కానీ అది నా వైపున పరిగెత్తింది. మళ్ళీ నాకు tension start అయ్యింది. దీని దుంప తెగ, ఇది నా వైపున పరిగెత్తుకొస్తోంది అనుకుంటూ , నేను కూడా పరిగెత్తడం మొదలు పెట్టా.. ముందు నేను, నా వెనుక పంది పిల్ల, దాని వెనుక భౌ .. భౌ మంటూ మొరుగుతూ ఆ కుక్క. అలా కొద్ది దూరం పరిగెత్తాం. ఆ situation లో ఆ scene ఎవరైనా చూసి ఉండి ఉంటే అదేదో కార్టూన్ మూవీ క్యారక్టర్స్ లాగా కనబడి ఉండే వాళ్ళం. నేనేమైనా కాపాడుతానేమోనని నా వైపుకి పరిగెత్తినట్టుంది ఆ అమాయకపు పంది. కానీ నేను కూడా పరిగెత్తేసరికి ఓర్నీ! వీడు నాకంటే పెద్ద పిరికివాడులా ఉన్నట్టున్నాడే అని definite గా అనుకుని ఉండి ఉంటుంది. తనని తానే కాపాడుకోవడం కన్న ఉత్తమమైన ఆలోచన ఇంకేది లేదనుకుని ఉన్నట్టుంది. ఇంతలో కుక్క మొరగడం ఆగిపోయింది. “ఎందుకబ్బా..” అని వెనుకకి తిరిగి చూశా. ఆ పందిపిల్ల ఆగిపోయి కుక్క వైపుకి తిరిగి ఉంది. వెంటనే ఈ పందిపిల్ల ఓ అడుగు ముందుకేసింది. ఆ కుక్క ఓ అడుగు వెనుకకి వేసింది. ఇది ఇంకో అడుగు ముందుకేసింది. అది ఇంకో అడుగు వెనుకకి వేసింది. అంతే! పందిపిల్ల కి ఏదో ట్రిక్కు అర్థం అయిపోయినట్లు కుక్కను తరుముతూ పరిగెత్తడం మొదలు పెట్టింది. ఆ కుక్క కూడా భయంతో వెనుకకి పరిగెత్తడం మొదలు పెట్టింది. ఇదేదో బాగుందే అనుకుంటూ ఈ reverse scene చూద్దామని నేను కూడా పంది వెనుకాలనే పరిగెత్తడం మొదలు పెట్టా. ఇప్పుడు ముందు కుక్క, తరువాత పంది పిల్ల, ఆ తరువాత నేను... అలా కొద్ది దూరం పరిగెత్తాం. ఇంతలో పందిపిల్ల తను save అయిపోయానులే అనుకుందేమో నా గురించి పట్టించుకోకుండా పక్క సందులోకి వెళ్ళిపోయింది. ఈ లోపున కుక్క వెనుకకు తిరిగి పందిపిల్ల పక్కకు వెళ్ళిపోవడం గమనించింది. వెంటనే కుక్క కూడా ఆగిపోయింది. టక్కున నేను కూడా ఆగిపోయా. ఇప్పుడు ఆ వీధిలో మళ్ళీ కుక్క , నేను మిగిలాం. ఆ పందిపిల్ల అలా కుక్కను తరుముకోవడం చూశాక నాలో ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. చేతిలోకి ఒక రాయిని తీసుకుని కుక్క వైపుకి చాలా confident గా అడుగులు వేసా. నాలో భయం ఛాయలు కనబడకపోయేసరికి కుక్క పారిపోయింది.. అంతే ఆ రోజు నుంచీ నాకు కుక్కలంటే భయం పోయింది. అలా అని కుక్కల గుంపు ఉంటే వాటి దగ్గరకు direct గా భయపడకుండా వెళ్ళిపోతానని కాదు. ఆ భయం ఫోభియా గా మారకుండా general గా అందరూ కుక్కల దగ్గర ఎలా ఉంటారో అంత ధైర్యం వచ్చింది. మా సాయి ప్రణీతకు కూడా కుక్కలంటే విపరీతమైన భయం.. Same to Same నేను చేసినట్టే తను కూడా కుక్కలు అక్కడెక్కడో కనిపించినా మా వెనుకాలకి వెళ్ళిపోతుంది. మమ్మల్ని లాక్కుంటూ దూరంగా వెళ్ళిపోతుంది, లేదంటే అసలు ఆ ప్రక్కకే రాదు. మామూలుగా ఇంట్లో అందరూ చాలా సార్లు ధైర్యం చెప్పి చూశారు, కానీ ఆ భయం మాత్రం పోలేదు. ఈ మధ్యనే ఓ రోజు నేను తనకి ఈ పంది పిల్ల కథ చెప్పా.. అంతే ఆశ్చర్యంగా తనకి కుక్కలంటే ఇంతకు ముంధు ఉన్న భయం పోయింది.. పూర్తిగా పోలేదు కానీ, ఇంతకుముందుతో పోలిస్తే చాలా వరకు పోయింది. చివరాఖరుగా నేను చెప్పొచ్చేదేమిటంటే .. బయట కూడా చాలామంది మనల్ని ఏదో ఒక విధంగా భయపెడుతూనే ఉంటారు. ఎప్పుడూ ఊగిసలాడుతూ, భయపడుతూ ఉంటే మన చుట్టూ ఉన్న ప్రతిదీ మనల్ని భయపెడుతూనే ఉంటుంది. దీని వల్ల మనం ఎప్పుడు in-secured గా ఫీల్ అవుతూనే ఉంటాం.. ఒక్కసారి మనం ఎదురు తిరిగితే ..?? కనీసం మనలోని భయం సగం వరకైనా పోతుందని నా ప్రగాఢ నమ్మకం.
Posted on: Thu, 18 Dec 2014 05:31:43 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015