ఈ పెళ్ళిలో ఏం గొప్పతనం - TopicsExpress



          

ఈ పెళ్ళిలో ఏం గొప్పతనం వుందో తెలియదు గానీ, ఒక స్త్రీ మాత్రం తనని తాను పూర్తిగా కోల్పోతుంది, తనని తాను అంకితం చేసుకుని బ్రతుకుతుంది, తనకంటూ ఆశలు వుండకూడదు, తనకంటూ కొన్ని ఇష్టాలూ వుండకూడదు, పెళ్ళైంది మొదలు పేరు కూడా మిసెస్ పలాన మగాడి పేరు తగిలిస్తారు, అంటే సొంత వ్యక్తిత్వం కూడా వుండకూడదు, ఇంటి పేరు మారిపోవాలి, అప్పటి వరుకు పెరిగి వచ్చిన వాతావరణం ఒక్కసారిగా మర్చిపోయి, కొత్తగా వెళ్ళిన వాతావరణానికి ఉన్నపళంగా అలవాటు పడిపోవాలి, లేదంటే అయిన వాళ్ళే ఆడిపోసుకుంటారు, సొంతవాళ్ళే పొడుచుకు తింటారు,, ఎన్ని త్యాగాలు చేసినా చిన్న ఓదార్పు గాని గుర్తింపు గాని దొరకదు, ఒకవేళ దొరికినా ఈ కూర భలే వుంది రోజు ఇలా చెసి చావొచ్చుగా అనే వెటకారం,, అదేంటో వింత అన్నాళ్ళు మహా గారాభంగా పెంచి, మంచం దగ్గరకి కంచాలు తీసుకొచ్చి గోరు ముద్దలు తినిపించిన సొంత తల్లిదండ్రులు కూడా నువ్వు ఇలా వుంటే ఎలా, ఇక్కడ సాగినట్లు అక్కడ సాగవూ, అని పెళ్ళి అయిన మరుసటి రోజు నుండే వాయింపుడు మొదలెడతారు, ఇవన్నీ పడుతూనే, పడుతూ, లేస్తూ పడి పడి చస్తూ, అందరికీ నచ్చేట్లు, అందరూ మెచ్చేట్లు తనని తాను పూర్తిగా చంపేసుకుని, మనసుని తాకట్టు పెట్టి నోరు మూసుకుని ఈదుకొస్తున్నా ఎక్కడో ఒక చోట లోటు ఎత్తి చూపి సాధింపులు,,, ఎన్నో గాయాలు గుండెకి తగిలినా అబ్బా అనకూడదూ, అమ్మో అని మొత్తుకోకూడదు, ఆడది అంటే మగాడి సొత్తు అనీ, తరతరాలుగా మనిషి నరనరాల్లో ఎక్కించేసి, ఆడవాళ్ళలో కూడ ఈ భావనని పాతుకుపోయేలా చేసింది ఈ సమాజం..... నిజంగా నూటికి 80% ఆడవాళ్ళు మనసు చంపుకుని సమాజం కోసం పిల్లల కోసం కాపురాలు నెట్టుకొస్తున్నారు, నొరు తెరచి మనసులో రగిలే అగ్ని గుండం బద్దలు కొడితే నిజంగా 80% కాపురాలు కుప్పకూలిపోతాయ్,, ఎక్కడో 20% మాత్రమే నిజమైన మమతానురాగలతో ఒకరికి ఒకరు అన్నట్లు వుంటున్నారు,, మార్పు రావాలి, మగవాళ్ళ ఆలోచనల్లో మార్పు రావాలి, మగాడైతే ఏమైనా చేయొచ్చు, పెళ్ళాం నా సొంతం కొట్టొచ్చూ తిట్టొచ్చు అనే ఆలోచనల్లో మార్పు రావాలి, ఆడవాళ్ళకీ ఒక మనసు వుంటుంది, వాళ్ళకీ వ్యక్తిగతంగా కొన్ని ఇష్టాలు వుంటాయి వాటికి నా సహకారం అందించాలి అన్న ఆలోచన చేయాలి, అల కాకుండా పెళ్ళైంది ఇక నా సొత్తు, నేను చెప్పినట్లే వినాలి, నా కాలి కింద పడుండాలి, ఇష్టాఇష్టాలు వుండకూడదు, కేవలం సేవలు చేయటానికే పుట్టింది అన్నట్లు చూస్తే ఎందరో ఆడవాళ్ళ మనసుల్లో మొగుళ్ళు తప్పక భరించే బరువులు గానే మిగిలిపోతారు తప్ప, స్వచ్చమైన ప్రేమని పొందలేరు.... ఇది నిజం.... .......@ అభిలాష
Posted on: Wed, 25 Sep 2013 04:11:40 +0000

Trending Topics



the holiday season to stay on
LETTER FROM A MOTHER TO A DAUGHTER: "My dear girl, the day you

Recently Viewed Topics




© 2015