ఉక్రెయిన్ ప్రజలు - TopicsExpress



          

ఉక్రెయిన్ ప్రజలు పనికిమాలిన నాయకులను అస్సలు స్పేర్ చేయరు. ఉక్రెయిన్‌లో విటలీ జురవ్ స్కీ అనే ఎంపీ వున్నాడు. ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రజలకు ముఖం చూపించిన పాపాన పోలేదు. ప్రజల సమస్యలను పట్టించుకున్న పుణ్యానా పోలేదు. ఆయనగారి నియోజకవర్గం ప్రజలు చూశారూ చూశారు.. చివరికి పార్లమెంట్ ఎదురుగానే ఆయనకు ఘన సత్కారం చేశారు. మీతో మాట్లాడాలి సార్ అని పార్లమెంట్ నుంచి బయటకి పిలిచి, తమ దగ్గరకి వచ్చిన ఆయన్ని గట్టిగా పట్టుకుని మోసుకెళ్ళి పార్లమెంట్ ముందు వున్న చెత్తకుండీలో పారేశారు. చెత్తకుండీలోంచి బయటకి లేవబోయిన ఆయన మీదపడి అందరూ ఆయన్ని చెత్తకుండీలో మరింత లోపలకి నెట్టేశారు. పోలీసులు వచ్చి ఆయన్ని చెత్తకుండీలోంచి బయటకి తీశారు. తన నియోజకవర్గ ప్రజలు ఈ రకంగా అవమానించాక ఆయన ఊరుకున్నారా? ఆ మురికిబట్టలతోనే పార్లమెంట్‌ లోపలకి వెళ్ళి తన ఎంపీ పదవికి రాజీనామా చేసేశాడు
Posted on: Wed, 17 Sep 2014 13:56:13 +0000

Trending Topics



51819301218">LISTEN TO TAGALOG BROADCAST EVERY SATURDAY 7-8AM METRO MANILA
Today theres is only one thing on my mind: My wife, I love her
I moved 3000 miles away from all of my friends and family because

Recently Viewed Topics




© 2015