ఎ.పి.ఎం డి.సి కి చెందిన రూ - TopicsExpress



          

ఎ.పి.ఎం డి.సి కి చెందిన రూ 700 కోట్లు నిధులు, హెడ్ క్వార్టర్స్ పై తెలంగాణా కుట్రలు: ------------------------------------------------------------------------------------------- ఈ సంస్థ విధులు, కార్యకలాపాలు 95% ఆంధ్ర కే పరిమితం. ఈ సంస్థ కు ఉన్న నిధులు, వచ్చిన లాభాలు అన్నీ కూడా కర్నూల్, ప్రకాశం, కడప,, గుంటూరు, ఉత్తరాంధ్ర లో మైనింగ్ కు సంబందించినవే, వాటి నుండి వచ్చిన లాభాలే. ఈ సంస్థకు 700 కోట్ల డిపాజిట్ లు వున్నాయి. ఈ డిపాజిట్ లలో 200 కోట్లు ఆంధ్ర ప్రాంతం లో పుల్వరైసింగ్ మిల్లులు ప్రభుత్వానికి ఇచ్చినవే వున్నాయి. ఇవి ఎప్పటికైనా ఇచ్చేయాలి. మిగిలిన 500 కొట్లలో తెలంగాణా తమ వాటా (42%) కింద 200 కోట్లు అడుగుతోంది. కానీ తెలంగాణా లో ఈ సంస్థ కార్య కలాపాలు 5% కన్నా లేవు. ఈ ప్రకారం చూసినా, తెలంగాణా కు 25 కోట్లు కన్నా ఎక్కువ దక్కే అవకాశం లేదు. ఇది దక్కాలన్న కూడా, తెలంగాణా లో ఏ.పి.ఎం.డి.సి కు కార్యకలాపాలు ఉన్న ఆదిలాబాద్ నుండి లాభాలు వచ్చాయోలేదో చూడాలి. ఏ ప్రాంతం లో వున్నవి వారికే అని ప్రాతిపదికన సింగరేణి ని తెలంగాణా పూర్తిగా స్వాధీనం చేసుకుంది. కానీ ఈ సంస్థ విషయం లో తెలంగాణా 42% వాటా అడుగుతోంది. ఎ.పి జెన్కో ను విభజించిన తరహా లోనే ఎక్కడి ఆస్తులు అక్కడే, వాటి రెవిన్యూ, లాభాలు, అప్పులు, అడ్వాన్సులు, డిపాజిట్ లు ఏ ప్రాంతం నుండి వస్తే, ఆ ప్రాంతానికే చెందేటట్టు విభజించాలి. దీని ప్రకారం తెలంగాణా కు 5% మాత్రమె వారి వాటా వస్తుంది. హైదరాబాద్ లో ఎ.పి.ఎం.డి.సి కి ఉన్న ఉమ్మడి బిల్డింగ్ , ఉమ్మడి నిధులతో కట్టినా, ఎ.పి.ఎం.డి.సి కి తెలంగాణా లో పెద్దగా కార్యకలాపాలు లేవు కావున ఈ భవనాన్ని ఆంధ్ర ప్రదేశ్ కె అప్పగించాలి, లేదా దీనికి మార్కెట్ విలువను తెలంగాణా ప్రభుత్వం ఆంధ్ర కు చెల్లించాలి. బిల్లు లోని 53 వ క్లాజు లో చెప్పినట్టు, కేంద్ర కార్యాలయం తో సంబంధం లేకుండా, ఈ సంస్థ ఆస్తులు, అప్పులు మొదలైనవి, ఈ సంస్థ కార్యాలయం లేదా ఆపరేషన్స్ ఎక్కడ వుంటే ఆ ప్రాంతానికే చెందుతుంది. కావున, 95% ఆపరేషన్స్ ఆంధ్ర లోనే వున్నాయి కావున, ఈ నిధులలో కనీసం 95% ఆంధ్ర ప్రదేశ్ కె చెందాలి. ఈ సంస్థ ప్రాజెక్ట్స్ వారీగా లాభ నష్టాల ఖాతాలు తయారు చేస్తే, అప్పుడు ఎవరికెంత వాటానో తేలుతుంది. హెడ్ క్వార్టర్స్ నుండి రెవిన్యూ వుండదు కావున, ఈ భూమి, బిల్డింగ్ ను బిల్లు లో చెప్పిన విధం గా, జనాభా నిష్పత్తి లో పంచుకోవాలి. కానీ, ఈ వుమ్మడి భవనం పూర్తిగా ఆంధ్ర కార్యకలాపాల నుండి వచ్చిన నిధులతో, లాభాలతోనే రాజధాని హైదరాబాద్ లో కట్టారు, తప్ప వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిధులతో మాత్రం కాదు. కనుక ఈ భూమి, బిల్డింగ్ విలువ లో కనీసం 95% ఆంధ్ర ప్రదేశ్ కె చెందాలి. తెలంగాణా కు చెందాలిసిన 5% విలువను, డబ్బు రూపేణా లేదా, అప్పులలో సర్దుబాటు చేయవచ్చు. పైన చెప్పిన అంశాల ఆధారం గా, ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్ సంస్థను నియమించి ఈ విభజనను పూర్తీ చేయాలి. హైదరాబాద్ లో కేంద్ర కార్యాలయం ఉన్నంత మాత్రాన అది తెలంగాణా సొత్తు కాదు, హైదరాబాద్ అనేది 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని మాత్రమే. ఇలా కాదని తెలంగాణా ప్రభుత్వం మొండికేస్తే, గడిబిడి చేస్తే కనుక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, సింగరేణి, హైదరాబాద్, ఏ.పి.ఐ.ఐ.సి, జి.హెచ్.ఎం.సి, హెచ్.ఎం.డి.ఏ, కు ఉన్న నిధులలో, పన్ను బకాయిలలో 58% వాటా అడిగితీరాలి. Assets and liabilities of State undertakings. 53. (1) The assets and liabilities relating to any commercial or industrial undertaking of the existing State of Andhra Pradesh, where such undertaking or part thereof is exclusively located in, or its operations are confined to, a local area, shall pass to the State in which that area is included on the appointed day, irrespective of the location of its headquarters: Provided that where the operation of such undertaking becomes inter-State by virtue of the provisions of Part II, the assets and liabilities of–– (a) the operational units of the undertaking shall be apportioned between the two successor States on location basis; and (b) the headquarters of such undertaking shall be apportioned between the two successor States on the basis of population ratio. (2) Upon apportionment of the assets and liabilities, such assets and liabilities shall be transferred in physical form on mutual agreement or by making payment or adjustment through any other mode as may be agreed to by the successor States.
Posted on: Thu, 27 Nov 2014 07:35:36 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015