‘‘ ఎక్కడ ఏ సమస్యవున్నా, - TopicsExpress



          

‘‘ ఎక్కడ ఏ సమస్యవున్నా, దాని కారణాన్నీ, దాని పరిష్కారాన్నీ, గ్రహించాలంటే, చర్చ చాలా అవసరం. చర్చలో జరిగే వాద, ప్రతివాదాలనించే సరైన విషయం దొరకవచ్చు; కొన్ని సార్లు దొరక్కపోవచ్చు కూడా. చర్చ హేతుబద్ధంగా జరగాలి గానీ, నిందలతో కాదు. సమస్యకు సంబంధించిన నిజాల్ని తెలుసుకోవాలనే ఆసక్తీ, ఆతృతా, ఇరుపక్షాలకూ వుండాలి. ‘మా పక్షమే నెగ్గాలి’ అనే దృష్టితో అయితే, ఎవరి వాదాలు వాళ్ళ దగ్గిరే ఆగిపోతాయి. ఎదటి పక్షం అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం రెండో పక్షం బాధ్యత. ఏ పక్షం హేతు విరుద్ధంగావున్నా, అది చర్చ అవదు. రెండు దృక్పథాలమధ్య చర్చ జరుగుతున్నప్పుడు, అది ఆ పక్షాల కోసమే కాదు. ఆ సమస్య, ఆ వాదాల వాళ్ళదే కాదు. ఆ వాదాల ద్వారా పాఠకులు ఏదైనా నేర్చుకోగలగాలి. ’’ ఇవి రంగనాయకమ్మ గారు ఇవాళ సూర్య పత్రికలో ఓ చర్చను ముగిస్తూ రాసిన వాక్యాలివి. suryaa/opinion/edit-page/article-143406 ఎంత మంచి మాటలు! చర్చలంటే నిందలూ, దూషణలు కాదు కదా? అవి లేకపోతేనే ఏ చర్చకయినా అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యమైన చర్చకు ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా అది ఫలవంతమవుతుంది!
Posted on: Wed, 26 Jun 2013 05:15:15 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015