కీసరగుట్టలో బయటపడ్డ జైన - TopicsExpress



          

కీసరగుట్టలో బయటపడ్డ జైన తీర్థంకరుల పంచలోహ విగ్రహాలు కీసరగుట్టలో క్రీస్తు శకం సుమారు 6, 7 శతాబ్దాలకు చెందినవిగా భావిస్తున్న రూ.కోట్ల విలువ చేసే జైన తీర్థంకరుల పంచలోహ విగ్రహలు బయట పడ్డాయి. కీసరగుట్టలో తామర కొలను ప్రక్కన ఉన్న పురావస్తు శాఖ ఆదీనంలోని విష్ణు కుండినుల రాజప్రసాదాల కట్టడాల వద్ద బండలు పరిచేందుకు పురావస్తు శాఖ రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు పలువురు పురావస్తు శాఖ అధికారుల సమక్షంలో శనివారం కూలీలు రాజప్రసాదాల వద్ద ఒక లడుగు మేర తవ్వకాలు జరుపగా ఒక అడుగు నుండి సుమారు 6, 7, 8 ఇంచుల ఎత్తుతో కూడిన 12 జైన తీర్థంకరుల విగ్రహాలతో పాటు ఒక అనుగు విగ్రహం బయట పడింది. విగ్రహాలు పురాతనమైనవి కావడంతో జైన విగ్రహాల కాళ్లు పీటలు విరిగి ఉన్నాయి. పూరాతన పంచలోహ విగ్రహాలు బయట పడ్డ విషయాన్ని స్థానిక సిబ్బంది ఉన్నతాధికారులకు తెలపడంతో పురావస్తు శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు కీసరగుట్టకు చేరుకున్న డిప్యూటీ డైరెక్టర్‌ బ్రహ్మచారి, ఎడి ఇంజనీర్‌ దశరథ, కన్సల్టింగ్‌ ఇంజనీర్‌ అజీమ్‌ ఉస్మాన్‌లు విగ్రహాలను పరిశీలించారు. ఈసందర్భంగా పురావస్తు శాఖ డిప్యూటీ ఇంజనీర్‌ బ్రహ్మచారి మాట్లాడుతూ.. చారిత్రక ప్రదేశంలో దొరికిన జైన విగ్రహాలు 6, 7 శతాబ్దాలకు చెందినవిగా భావిస్తున్నామని తెలిపారు. పురావస్తు శాఖ తవ్వకాలలో కీసరగుట్ట ప్రాంతం ఇప్పటి వరకు విష్ణు కుండినులకు సంబంధించిన ప్రామాణికంగా భావిస్తుండగా! ఇప్పుడు ఇక్కడ బయట పడ్డ జైన విగ్రహాల కారణంగా ఈ ప్రదేశం విష్ణు కుండినుల ప్రామాణిక మందిరాలు అనేకంటే జైన మందిరాల ఆలయాలుగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో చరిత్ర మారే అవకాశం ఉందన్నారు. అంతకు ముందున్న జైన మందిరాలను కూల్చి ప్రామాణిక మందిరాలు నిర్మించి ఉండవచ్చునని వీటిపై పరిశోధన అవసరమని పేర్కొన్నారు. బయట పడ్డ విగ్రహలను నగరంలోని మ్యూజియానికి తరలించారు. ఈసందర్భంగా కేర్‌ టేకర్‌ రాజేందర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ప్రేమ్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. జైనుల విగ్రహాలు బయట పడ్డ ప్రదేశంలో పురావస్తు శాఖ అధికారులు గట్టి బందోబస్తూ ఏర్పాటు చేసి నిధులు వెచ్చించి తవ్వకాలు జరిపితే మరిన్ని చారిత్రక అనవాళ్లు బయట పడే అవకాశం ఉందని ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిందిగా చరిత్రకారులు కోరుతున్నారు. 1) suryaa/andhra-pradesh/article-197298 2) prabhanews/headlines/article-467103 3) 54.243.62.7/regional/article-142107 4) english.tupaki/enews/view/Keesara-Gutta-is-a-Jain-temple-/78323 5) namasthetelangaana/Telangana/%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B0%B0%E0%B0%97%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AC%E0%B0%AF%E0%B0%9F%E0%B0%AA%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1-%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%B2%E0%B1%8B%E0%B0%B9-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-1-2-419885.aspx#.VEnlGfm1aDk 6) bharatchannels/news/telugu/story.php?id=926509 7) etelangana.org/news/news_details/1281 8) apherald/POLITICS/ViewArticle/69710/Was-Keesaragutta-a-Jain-Temple-/ 9) jainheritagecentres/index.php/news/news-updates/1435-jain-tirthankaras-idols-belonging-to-4th-century-unearthed-at-keesaragutta 10 ) timesofindia.indiatimes/india/Idols-of-Jain-Tirthankaras-belonging-to-4th-century-unearthed/articleshow/44895614.cms
Posted on: Fri, 24 Oct 2014 05:42:38 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015