గాంధీ అంటే ఒక వ్యక్తి - TopicsExpress



          

గాంధీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి గాంధీ అంటే ఒక పెర్సన్ కాదు ఇక ఇజం ----- ఇలాంటి ఒక వ్యాఖ్య చేసినప్పుడు. వీడెవడో గాంధీ అంటున్నాడు అంటే వీడు కాంగ్రేసు మనిషా? మరి స్వచ్చ భారత్ అని కూడా అంటున్నాడు అంటే వీడు బీజేపీ నా? ఇలా ఉంటోంది అలోచన. అవును! అంటే అర్థం మనం పీపుల్ ఓరిఎంటెడ్ వ్యూ కాకుండా ఆ వెనకాల యేముంది? అని చూడడం నేర్చుకోవాలి. అదే మాములుగా చూస్తే కంటికి కనపడనిది. అద్వైతం కూడా ఇదే చెప్తోంది, ఇలా చూడడం నేర్చుకోండి అనే చెప్తోంది. ఎవరైనా ఏదైనా ఒక కామెంట్ చేసినప్పుడు, వాడు ఎవడు, ఏ పార్టీకి చెందిన వాడు? మన పార్టీయేనా కాదా? మన పార్టీ కాకపోతే వాడి బతుకు మాడిన బజ్జీ చేద్దాం... ఇలా ఉంటున్నాయ్ ఇప్పటి రాజకీయాలూ వాళ్ళ ఆలోచనలు, ఇప్పటి మీడియా కూడా ఇలానే ఎదో ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించాలని అనికుంటోంది. ఇలాంటి దౌర్భాగ్యపు అలోచనా స్థితి నుండీ మనం ఇంకా మన ఆలోచనలు ఎదగాలి అప్పుడే మానవ మనుగడ కి మనం కృషి చేయగలుగుతాం వాడు ఏం చెప్తున్నాడు? అందులో అసలు ఏ విషయం దాగుంది? అది వ్యవస్థ కి గాని సమాజానికి గానీ మేలు చేసే అంశం గురించి చెప్తున్నడా లేదా? లేక వ్యవస్థని సమూలంగా నాశనం చెయ్యాలనే తలంపుతో ఉన్నాడా? అన్నది అంచనా వేయవలసిన విషయం. నిజమైన జర్నలిజం వ్యవస్థ గురించి, సమాజం గురించి, ప్రభుత్వం పరిపాలన అందించే తీరులో నిర్మాణాత్మక విమర్శలని చేయాలని తద్వారా సుపరిపాలనకి తన వంతు బాధ్యతని నెర వేర్చాలని తపన పడుతుంది. అంతే గాని పనికి మాలిన వివరణలు అసందర్భ ప్రేలాపనలు పేలుతూ సామాన్య జనాన్ని తప్పు దారి పట్టించే ప్రయత్నం చేయదు. అలా ఒక నిజాయితీ కూడిన ఆలోచనా సరళిని చూపిస్తూ తీసిన సినీమాయే మహాత్మా . కాబట్టే క్రిష్ణవంశీ, శ్రీ కాంత్ అభినందనీయులు.
Posted on: Sun, 02 Nov 2014 20:55:56 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015