జగన్‌ అక్రమ ఆస్తులపై - TopicsExpress



          

జగన్‌ అక్రమ ఆస్తులపై సత్వర చర్యలు తండ్రి అధికారాన్ని అడ్డుపె ట్టకొని లక్ష కోట్లు రూపాయల అవినీతికి పాల్పడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై సత్వర చర్యలు తీసుకోవాలని తెలు గుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌ను కోరారు. జగన్‌పై జరుగుతున్న సీబిఐ, ఈడీ విచారణ అన్ని కోణాల్లో నుంచి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టిడిపికి చెందిన మోత్కుపల్లి నర్సింహ్ము లు, పి రాములు, కె.ఎస్‌. రత్నం, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ లింగారెడ్డిలు బుధవారం సాయింత్రం 4 గంటల కు గవర్నర్‌ను కలిసారు. ఈ సందర్బంగా లక్షల కోట్ల రూపాయల ప్రజల సోమ్మును ధర్జాగా దోచుకున్న జగన్‌పై ఇప్పటివరకు ఏవిధమైన చర్యలు లేవని వివరించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి 500 లంచం తీసుకుంటూ పట్టుపడితే అతని కుటుంబ సభ్యులతోపాటు, బంధువుల ను, సన్నిహితులను, స్నేహితులను అందరి ఇళ్లపై సోదాలు నిర్వహించి ఆస్తులు జప్తు చేస్తారని, కాని వైఎస్‌ రాజశేఖర ్‌రెడ్డి కుటుంబం లక్ష కోట్లు దోపిడీకి పాల్పడినా, వారిపై ఎటువంటి చర్యలు లేవన్నారు. ఇప్పిటివరకు సీబీఐ విడు దల చేసిన 10 ఛార్జిషీట్లును పరిశీలిస్తే వాటిలో జలయ జ్ఞం, భూములు, సెజ్‌లు, గనుల్లో వైఎస్‌ కుటుంబం పాల్ప డిన అక్రమాలకు సంబంధించిన సమాచారం లేదని తెలి పారు. షర్మిల, భారతి, విజయలక్ష్మి, బ్రదర్‌ అనిల్‌, రవీం ద్రనాధ్‌రెడ్డి, దుష్యంత్‌రెడ్డి, వివాకానంద రెడ్డిలను సీబీఐ ఎందుకు విచారించటం లేదని, వారి అక్రమాలు సీబీఐకి కనిపించటంలేదా అని వారు ప్రశ్పించారు. వైఎస్‌ కుటుం బ సభ్యులందరూ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడ్డారన్న విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలిసినా, సీబీఐకి తెలవక పోవటమేమిటన్నారు. అత్యంత స్వల్ప కాలంలో అవినీతి కుంబకోణాలతో ప్రపంపచంలోనే సంపన్నుడిగా వైఎస్‌ జగన్‌ అవినీతి కోణాలు దేశంతో పాటు, విదేశాలకు తాకిం దని విన్న వివరించారు. హవాలా మార్గంలో నల్లధనం తరలింపుపై వైఎస్‌ జగన్‌పై అనేక అభియోగాలు వచ్చినా ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ కేసు లు విచారణ వేగవంతం చేసేందుకు ప్రధాన మంత్రి అను మతి వ్వటంలేదని తెలిపారు. 45 వేల కోట్లు రూపాయలు అవినీతి జరిగినట్లు సీబీఐ నిర్థారించినా, ఇప్పటివరకు కేవలం 270 కోట్ల రూపాయల ఆస్తుల మాత్రమే జప్తు చేశారని, విచారణలో నిర్థారణ అయిన అక్రమాస్తులకు, జప్తు చేసిన ఆస్తులకు ఏమాత్రం పొంతన తేదని వారు గవర్నర్‌కు విన్న వించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారులను విచారించేందుకు అనుమతి ఇవ్వ మంటూ ప్రధాన మంత్రి పరిధిలోగల డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ ట్రైనీ మంత్రిత్వ శాఖలను సీబీఐ అర్థించి నప్ప టికి, ఇంతవరకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. లోటస్‌ పాండ్‌లో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన విలాస భవనంవైపు సీబీఐకాని, ఈడీ కాని కన్నెత్తి చూడలేదన్నారు. బెంగుళూరు ఎలహంక సమీపంలో 32 ఎకరాల విస్తీర్ణం లో 250 కోట్ల రూపాయలతో నిర్మించిన రాజభవనంపై ఎటువంటి విచారణ జరపలేదని, కడప, పులివెందుల, ముంబైలో నిర్మించిన ఇంద్ర భవనాలు సీబీఐ, ఈడీలకు కనిపించటంలేదా అని వారు అన్నారు. ద్వారంపూడి చంద్ర శేఖర్‌రెడ్డి పేరుతో నిర్మించిన జననీ ఇన్‌ఫ్రాకు బదలా యించిన 12 సాక్షి కార్యాలయాల వ్యవహారాల గురించి, వాటి వెనుక ఉన్న గుట్టుమట్లు గురించి సీబీఐ కాని, ఈడీ కాని ఎటువంటి విచారణ జరపటంలేదన్నారు. ఆంధ్రప్ర దేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, అరుణా చల్‌ ప్రదేశ్‌లో 10 వేల మెగావాట్ల సామర్థ్యంతో 60 వేల కోట్ల రూపాయల వ్యయంతో జగన్‌ అండ్‌ కో నిర్మించిన విద్యుత్‌ ప్రాజెక్టుల గురించి సీబీఐ ఎక్కడా ఛార్జిషీట్‌లో పొందుపరచలేదని అన్నారు. జగన్‌ తన నల్లధనాన్ని మనీ లాండరింగ్‌ చేసి బినామీ కంపెనీలకు చేర్చినట్లు హసన్‌అలీ ఈడీ ముందు సాక్ష్యం చెప్పినా, వాటిగురించి విచారణ జర పటంలేదని గవర్నర్‌కు తెలిపారు. వైఎస్‌ అల్లుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌కు ఖమ్మం జిల్లాలో నిబంధనలకు వ్యతిరే కంగా కేటాయించిన లక్షా 40 వేల ఎకరాల్లోని 40 లక్షల కోట్ల ఇనుప ఖనిజం గురించి సీబీఐ ఎక్కడా పొందు పరచలేదన్నారు.
Posted on: Fri, 20 Sep 2013 08:41:16 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015