జాతీయ రాజధాని ప్రాంత - TopicsExpress



          

జాతీయ రాజధాని ప్రాంత శాంతి భద్రతను కేంద్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించాలన్నది...అమెరికా వంటి సమాఖ్య ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలలో కూడ ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి ఉంది. అందువల్ల రాజకీయ నాటకం మాట ఎలా ఉన్నప్పటికీ ఢిల్లీ పోలీసు వ్యవస్థను ప్రాంతీయ ప్రభుత్వ అధికార పరిధిలోకి తేవడం ఆచరణకు వీలుకాదు. అది రాజ్యాంగ వైపరీత్యం మాత్రమే కాగలదు. ఇదంతా తెలిసినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకని పోలీసులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఆరంభించింది? కాంగ్రెస్‌ను కౌగలించుకొనడం ద్వారా అప్రతిష్ఠపాలైన ఆమ్ ఆద్మీ కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నట్టు అభినయించడానికి సాకును వెదకుతోంది. పోలీసులు తమ మాటను, ఆదేశాలను లెక్క చేయకపోవడం తక్షణ నెపంగా ఉపయోగపడుతోంది. గద్దెనెక్కిన తరువాత నెలరోజులు పూర్తి కాకముందే ఆమ్ ఆద్మీ పట్ల ప్రజల భ్రమలు తొలగిపోతున్నాయి. పార్టీకి చెందిన శాసనసభ్యులే అరవింద కేజరీవాల్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టే పరిస్థితి దాపురించింది. అందువల్ల పరిస్థితి సంక్షోభ గ్రస్తం చేయడం ద్వారా కాంగ్రెస్‌ను కవ్వించడం కేజరీవాల్ ఎత్తుగడ కావచ్చు. కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకున్నప్పటికీ, లేదా కేంద్రం తన ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటికీ మళ్ళీ ‘కధానాయకుడు’ కావచ్చు. ప్రజల సానుభూతి పొందవచ్చు. కేజరీవాల్ వ్యూహం ఇదేనేమో??
Posted on: Mon, 27 Jan 2014 09:20:50 +0000

Recently Viewed Topics




© 2015