నగరం లో ఇప్పుడిప్పుడే - TopicsExpress



          

నగరం లో ఇప్పుడిప్పుడే పచ్చదనం పరవళ్ళు తొక్కుతోంది .జనాల కళ్ళల్లో మళ్ళీ కాంతి కనిపిస్తోంది .ముఖాలలో నిగారింపు ..తుపాను ప్రభావం నించి దాదాపుగా అందరూ తేరుకున్నట్టే .ప్రాణ నష్ట్టం లేకపోవటం పెద్ద రిలీఫ్ .ఆస్తి నష్టం నివారణకు ప్రణాళికలు చురుకుగా సాగుతున్నాయి .కొత్త గా వేసిన వైట్ కలర్ LED lamps తో నగరం లోని రోడ్లు ,వెండి తెరపై ముంబాయి తారలలా నున్నగా ,నిగనిగలాడుతున్నాయి. శిశిరం ప్రారంభం కావటం తో మంచు తెరలతో విశాఖ సరికొత్త అందాలను సంతరించుకుంది. ఇలాంటి సమయం లో కొందరు celebrity లు “ మేము సైతం ,మేము సైతం” అంటూ మైకు ముందు గొంతు చించుకొని ఎందుకు గావుకేకలు పెడుతున్నారో నాకైతే అర్ధం కాలేదు.పరిస్థితులు కుదుట పడ్డాయి .కొంచం నెమ్మదిగా పాడుకోవచ్చు .తప్పు లేదు
Posted on: Sat, 29 Nov 2014 05:31:51 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015