న్యాయసూత్రాల ప్రకారమే - TopicsExpress



          

న్యాయసూత్రాల ప్రకారమే నీటి పంపకం:కేసీఆర్ హైదరాబాద్ : నీటి పంపకాల విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లేనిపోని అపోహాలు సృష్టిస్తున్నారని, మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక మాట్లాడటం చాలా బాధాకరమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారమే నీటి పంపకం జరుగుతుందని తెలిపారు. నదులను దేశాలే పంచుకున్నప్పుడు తెలంగాణ, సీమాంధ్ర పంచుకోలేవా అని ప్రశ్నించారు. నీటి పంపకం విషయంలో అపోహాలు సృష్టించి భవిష్యత్ తరాల్లో విషబీజాలు నాటొద్దు అని విజ్ఞఫ్తి చేశారు. సీఎం ఏకరువు పెట్టుకుంటూ సముద్రంలోకి 3 వేల క్యూసెక్కులుగా నీరు వృథాగా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారే.. పాలకులుగా ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే సముద్రంలోకి నీళ్లు పోతున్నాయని స్పష్టం చేశారు. 57 ఏళ్ల తరువాత సీమాంధ్రులకు ఇవన్నీ గుర్తొస్తున్నాయా అని అడిగారు. 14 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న చిన్న చిన్న ప్రాజెక్టులు 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాయా అని ప్రశ్నించారు. మీ ప్రాజెక్టులను తాము నమ్మలా అని అడిగారు. ప్రాణహిత, చేవెళ్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటున్నారు.. దానికి కేటాయించింది మాత్రం 14 టీఎంసీల నీళ్లు.. ఇలా పొంతన లేకుండా సీఎం చెప్పడం సబబు కాదన్నారు. 14 టీఎంసీలతో 16 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యమా అని ప్రశ్నించారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి మీద ఒక జాతీయ ప్రాజెక్టు, కృష్ణా మీద ఒక జాతీయ ప్రాజెక్టు కడుతామని తెలిపారు. నీళ్ల పంపకం విషయంలో 2 రాష్ట్రాలకు ఏ నియమాలున్నాయో... 29వ రాష్ట్రమైన తెలంగాణకు అవే నియమాలు ఉంటాయని చెప్పారు. ఐదు నదులను పాకిస్తాన్‌ను పంచుకుంటున్నానయని గుర్తు చేశారు. ఇతర దేశాలతోనే మన దేశం నీటిని పంచుకుంటున్నప్పుడు తెలంగాణ, సీమాంధ్ర నీటిని పంచుకోవడానికి అభ్యంతరాలు ఎక్కడ ఉంటాయని అడిగారు.
Posted on: Fri, 09 Aug 2013 11:58:12 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015