మీ ఫోన్ - TopicsExpress



          

మీ ఫోన్ దొంగిలించినందుకు దొంగే బాధపడిపోతాడు…. నమ్మబుద్ధి కావట్లేదా…? Must Watch & Share వీడియో లింక్ ఇది: https://youtube/watch?v=7dhBYj19-SE మీ ఫోన్‌ని కాపాడుకోవడానికి మీరు జీవితంలో రకరకాల సాఫ్ట్‌వేర్లు వాడి చూసుంటారు….. ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చూపించినంత టెక్నిక్‌ని మించినది మాత్రం ఏం ఉండదు…. ఈ వీడియో చూసి నేను చెప్పినట్లు చేస్తే మీ ఫోన్ దొంగిలించినందుకు దొంగే బాధపడాలి :P ఫోన్ పోయినప్పటి నుండి ఆ ఫోన్ సరిగ్గా ఎక్కడుందో, దొంగ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో కనిపెట్టేయొచ్చు… అతను ఏ నెంబర్లకి ఫోన్లు చేస్తున్నాడో, SMSలు చేస్తున్నాడో ఆ మెసేజ్‌ల వివరాలతో సహా మీ కంప్యూటర్ స్క్రీన్ మీదే చూసేయొచ్చు. దొంగ తన ఫ్రెండ్స్‌తో కూర్చుని ఖుషీ చేసుకుంటుంటే… అతనికి తెలీకుండా వారందరి ఫొటోలూ తీయొచ్చు…. వీడియో తీయొచ్చు…. వాళ్లేం మాట్లాడుకుంటున్నదీ ఆడియో రికార్డ్ చేసి వెంటనే మన మెయిల్‌కి పొందొచ్చు…. వాళ్ల ఫ్రెండ్స నెంబర్లు మనకు తెలుస్తుంటే… అతనెక్కడ తిరుగుతున్నాడో క్షణం క్షణం మనకు తెలుస్తుంటే… సిమ్‌ మార్చేసినా ఉపయోగం లేకపోతే… చివరకు దొంగ ఫొటో, వీడియో, మాటలూ, SMS మెసేజ్‌లూ కూడా మనకు వచ్చేస్తుంటే….. ఇంకా పోలీస్ కంప్లయింట్లెందుకు…? నేరుగా మనమే ఓ అరగంటలో పట్టుకోలేమా….? నేనైతే గత ఏడాదిన్నరగా ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాను… ఎక్కడైనా ఫోన్ మర్చిపోయి వచ్చినా అస్సలు భయం లేదు…. నాకెందుకు భయం…. దొంగ భయపడాలి గానీ :P ఖరీదైనవీ, మామూలువీ రకరకాల ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని “ఖచ్చితంగా” మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చేసి వారి ఫోన్లనీ కాపాడండి… వీడియో లింక్ ఇది: https://youtube/watch?v=7dhBYj19-SE గమనిక: ఈ సాఫ్ట్‌వేర్‌ని uninstall చెయ్యకుండానూ, Factory Reset చేసినా పోకుండానూ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దాని కోసం ఫోన్ రూట్ చేయాల్సి ఉంటుంది. – నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ computerera.co.in youtube/nallamothu nallamothusridhar
Posted on: Thu, 11 Sep 2014 14:04:02 +0000

Trending Topics



ss="sttext" style="margin-left:0px; min-height:30px;"> Looking for the best tailgate in Arlington for the A&M Game on
Happy weekend to you all my beloved and blessed friends. Today is

Recently Viewed Topics




© 2015