రెచ్చగొట్టుకుంటే నష్టం - TopicsExpress



          

రెచ్చగొట్టుకుంటే నష్టం ఎవరికి? ఫేస్ బుక్ అనేది అభిప్రాయ వేదిక మాత్రమే. ఇది మనలోని మనస్తత్వాన్ని బయటపెట్టే వేదిక. అప్రాంత్తంగా ఉండండి. రాష్ట్ర విభజన వ్యక్తుల మద్య కాదు, ప్రాంతాల మద్య అని ఒక వైపు చెబుతూ అవతలి పక్షం పైన కామెంట్ లు చేస్తూ ప్రదర్శించే శాడిజం ప్రమాదకరం. కొన్ని ఉదహరిస్తున్నాం. 1. మేము ఇంతకాలం అడవిలో ఉన్నాం, ఇప్పుడు అవతలి వాళ్ళు అడవిలో ఉండాల్సిందే. అసలు ఇంతకాలం ఎవడు ఎక్కడా అడవిలో ఉన్న వాళ్ళు కాదు. అవకాశాల్లో ఎవరివి వారికి దక్కాయి. మాకంటే సీమాంధ్రులు దక్కించుకున్నారన్నది తెలంగాణ వాసుల లో కొందరి అభిప్రాయం. ఓ కె ఇప్పుడు ఏమి అవకాశాలు పెరుగుతాయో చూడండి. 2. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే వచ్చాం అన్నది సీమాంధ్రులు వాదన. ఓ కె ఆదే నిజం అయితే ఇప్పుడు ఆ అవకాశాలు వచ్చే చోటికి మళ్ళీ వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. 3. ఇక్కడ దోచుకున్నారు, అక్కడ దోచుకున్నారు అన్నది. ఎవడి ఇంట్లోకి ఎవడు వెళ్ళి ఏది తెచ్చుకొని దోచుకునేది లేదు. ఆ పదాలు నేతలు సృష్టించిన వాదాలు. నేతలు భూమి కేటాయిపులు పొందితే అది వారి వ్యక్తిగత దోపిడీ అవుతుంది తప్ప సుబ్బ రావు కి అప్పారావు కి ఏమిటి సంబంధం. 4. మేము కావాలనుకున్న ఉద్యోగం రాలేదు కాబట్టి అది సాధించినవాడు దోపిడీదారు అనే వాదన చదువుకున్న వాళ్ళు మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది. 5. ప్రభుత్వ ఉద్యోగాలలో అసమానతలు అని చెబితే అవి ఇప్పుడు తీరే సమయం వచ్చింది కాబట్టి వేచి చూడండి. 6. సంస్కృతి, సంప్రదాయాల మీద ఎవరి అభిమానం వారిది. ఎదుటి వారి ని నిందించే అనవసరపు మాటలు రువ్వుకోవద్దు. పాత సంస్కృతులు ఎవరూ పాటించటం లేదు. కొత్త సంస్కృతి కాపాడుకుందాం. భార్య, పిల్లలు ఇదే నా జీవితం అనుకునే రోజులు ఇవి. అక్కడకే మనం సిద్దం అవుతున్నాం కాబట్టి ఓ కె. తిట్లు, శాపనార్ధాలతో స్నేహ బంధాలు చెడ గొట్టుకోవటం అనవసరం. ఇక్కడ అన్నా తమ్ముళ్ళ బంధాలు లేవు. సవతి బిడ్డల మాటలు వస్తున్నాయి. స్నేహ బంధాలు పోయి శతృత్వాలు ఏర్పడుతున్నాయి. అది మంచి సంస్కారం కాదు. చదువుకున్న వాళ్ళకి ఆలోచన తో పాటు వివేచన, విచక్షణ కొరవడితే మాటలు తేడా వస్తే ముసుగులతో రెచ్చగొట్టే వెధవలు మన మద్యకి వస్తే పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. లేకుంటే మానసిక విభజన అధికం అయ్యి అసహ్య ఫలితాలు వస్తాయి. .
Posted on: Fri, 02 Aug 2013 08:02:27 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015