వితండ వాదం మా ఏరియా లో కి - TopicsExpress



          

వితండ వాదం మా ఏరియా లో కి వచ్చి సభ పెడతారా? అనుమతులు ఇస్తారా? అంటూ వీరంగం చేయటం. దాడులకి దిగటం నీచాతి నీచం. డిల్లీ కి వెళ్ళి ఇరు ప్రాంతాలు నేతలు నిరసనలు, వాదనలు వినిపించారు. మీ ఇద్దరు మా ఏరియా కి వచ్చి ఎలా మీ వాదం వినిపిస్తారు అనీ ఎవరు అడగలేదు. అది దేశ రాజధాని కాబట్టి. అలాగే హైదరాబాద్ లో సభ పెట్టి తమ వాదన వినిపించే అవకాశం ఉండాలి. అది నచ్చాల్సిన అవసరం ఏమిటి? విభజన నీ వాదం. అది నీకు నచ్చుతుంది. అవతలి వారికి నచ్చకున్నా వింటూ, జవాబు చెబుతూ ఉన్నారు కదా? అలాగే నువ్వు విని జవాబు చెప్పవచ్చు కదా? అది మానేసి సభ పైన దాడులకి దిగటం, బస్ ల పైన రాళ్ళు రువ్వటం అంటే ఉన్మాదమా? ఉగ్రవాదామా? సభలోకి చొచ్చుకెళ్లి వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే హీరో. ఆదే నీ దగ్గర చేస్తే ద్రోహి. తెలంగాణ వాదన తో సభ జరిగే చోటికి సమైక్య నినాదంతో ఎవరైనా వచ్చి అరిస్తే బ్రతకనిస్తారా? అయినా ఎన్ జీ ఓ సభ లో సంయమనం పాటించారు. అలాగే గూండాలని పక్కన పెట్టుకున్నారు అని హరీష్ రావు రెచ్చగొట్టినా, సభ కి వెళ్లే దారిలో నిజం హాస్టల్ విద్యార్డుల పేరుతో రాళ్ళు విసిరినా దాడికి వచ్చిన వాళ్ళు అయితే ఎదురు దాడి చేసే వాళ్ళు. కానీ సభలో పాల్గొని వెళ్ళి పోయారు. అక్కడక్కడా ఒకరిద్దరు రెచ్చిపోయిన ఘటనలని ఉద్యమ విష పుత్రికలు అయిన టీ న్యూస్, వీ 6 లలో దాడులుగా చూపించవచ్చు కానీ ఎంత రెచ్చగొట్టినా పని చేసుకు వెళ్ళి పోయిన సమైక్య వాద ఉద్యోగ, విద్యార్ధి నేతలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. విజయవాడ లో సభ పెడితే ఉరుకుంటారా? అన్నది కొద్నరి వాదన. వరంగల్ లో సమైక్య సభ పెడితే మీరు తోడు నిలిస్తే విజయవాడ లో పెట్టుకోవటంలో తప్పు లేదు. ఇక్కడ జరిగింది హైదరాబాద్లో . రాజధానిలో. విడిపోయే వరకు ఆదే రాజధాని. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఉమ్మడి రాజధాని గా పదేళ్ళు కూడా తప్పదు. ఇక్కడ ఒక వాదం వీనిపిస్తే మాత్రమే బ్రతకాలి, మరొక వాదం వినిపిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అనే వాళ్ళు ఎవరైనా ఈ ప్రజస్వామ్యం లో తీవ్రవాదులే. నా వాదన మాత్రమే వినాలన్న నియంతల నైజాం వారసులు లేదా, పట్వారీ, పటేల్ లకి ఈ తరం నాయకులే అవుతారు.
Posted on: Sun, 08 Sep 2013 06:54:07 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015