సమాజం సమాజం అని గోల - TopicsExpress



          

సమాజం సమాజం అని గోల చేస్తాం కానీ సమాజం అంటే ఏంటో కాదు , మరెక్కడో లేదు మనమే సమాజం మనదే సమాజం మన ఆలోచనా ధోరణిలో మార్పు రావాలే గాని ఊరకనె సమాజాన్ని ఆడిపోసుకోవడం కాదు ముందు మనం మారాలి మన ఆలోచనా దృక్పదం మారాలి ఎపుడు మన స్వార్ధం మనం అంతేనా ????? మరేం పట్టదా??? ఇంటిముందు గంపలో అవ్వ అమ్మే ఆకుకూర కట్టను గీచి గీచి బేరం ఆడుతాం పెద్ద పెద్ద martsలో వందలు వందలు సునాయాసంగా తగలేస్తాం బస్సు లో నలుగురికి చిల్లర ఇవ్వాల్సిన conductor దగ్గర రూపాయకు గొడవ చేసి రాద్దాంతం చేస్తాం పెద్ద పెద్ద restaurantsలో వందలు వందలు టిప్స్ ఇచ్చి వస్తాం పక్క ఊరి అతను మన ఊరికి వచ్చి స్థిరపడి కాస్త 4 డబ్బులు వెనకేసుకుని హాయిగా సంతోషంగా బతుకుతుంటే ఏదో కొంపలు మునిగిపోయినట్టు అరచి గగ్గోలు పెట్టి నా కడుపు కొట్టేస్తున్నాడు అని తన మీద పడి ఏడుస్తాం ఏళ్ళ తరబడి కలసి ఉండే అక్కన పక్కన వాళ్ళని మాత్రం పట్టించుకోము పక్క ఇంట్లో వాళ్ళకు ఏ సమస్య వచ్చినా మనకు పట్టదు పక్క వీధి వాడు చావు బతుకుల మద్య ఉన్నా మనకు పట్టదు ఎవరెక్కడ తగలడ్డా మనకు పట్టదు మనకు తెలిసింది, కావలసింది ఒక్కటే మనకంటే ఎవరు బాగా బతకకూడదు అంతే ఇదేనా మానవత్వం అంటే??? ఇదేనా సంఘ జీవుల లక్షణం మానవత్వం ఎటు పోతోందీ ??? మనం మానవుల్లా కాదు దానవుల్లా నడుచుకుంటున్నాం
Posted on: Sat, 10 Aug 2013 05:01:20 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015