స్తీవ్ జాబ్స్ కి ఈ - TopicsExpress



          

స్తీవ్ జాబ్స్ కి ఈ ప్రపంచం లో అతి పెద్ద భక్తుడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది నేనే,ఇప్పుడు నేను విన్న కొన్ని అతియోశక్తులు చెప్తానే ,నన్ను తిట్టొద్దు మరి , ప్రపంచం లో మొట్ట మొదట పర్సనల్ కంప్యూటర్ తయారు చేసింది స్టీవ్ జాబ్స్ ,కానీ ఆ ఐడియా ని XEROX కంపెనీ నుండి కొట్టేసాడు అంటారు , XEROX లాబ్స్ లో పని చేస్తున్న ఇద్దరు ఇంజినీర్ లు అప్పటివరకు ఉన్న IBM మెయిన్ ఫ్రేం అనే బండ సిస్టం కి ఆల్టర్నేటివ్ గా చిన్న కంప్యూటర్ ని small business ల కోసం తయారు చెయ్యాలి అని చెప్పి మొట్ట మొదటిసారిగా GUI (graphical user interface) తయారు చేసారు , మనోడు నైస్ గా వాళ్ళ ఐడియా ని కొట్టేసి , బెల్ లాబ్స్ వాళ్ళ UNIX కెర్నల్ కి నకలు రాసి రెండు కలిపి రుబ్బి ,తరువాత దానికి Mac OS అని పేరు పెట్టి Macintosh సిస్టమ్స్ తయారు చేసాడు , మౌస్ ఐడియా కూడా XEROX వాళ్ళదే , తరువాత ఆపిల్ కంపనీ పెట్టి కాలిఫోర్నియా లో పర్సనల్ కంప్యూటర్ లు అమ్మడం మొదలు పెట్టాడు స్టీవ్ జాబ్స్ , ప్రస్తుతం ఉన్న Typefaces కి మాత్రం ఆద్యుడు స్టీవ్ జాబ్స్ , తరువాత ఆపిల్ స్టీవ్ జాబ్స్ ని బయటకి నేట్టేయడం ,మనోడు Pixar స్టార్ట్ చేయడం ,డిస్నీ వాళ్ళతో కలవడం ,ఆ తరువాత ఆపిల్ లో జాయిన్ అయ్యి iPod తో మొదలు పెట్టి iPhone ,iPad , Mac PC లు తెచ్చి మన పాకెట్ లోకి ఇంటర్నెట్ తెచ్చి ప్రపంచ చరిత్ర గతిని మార్చాడు , ఇదంతా ఇలా ఉంటే సియాటిల్ కుర్రోడు బిల్ గేట్స్ అప్పటివరకు IBM ప్రాసెసర్ లకు ప్రోగ్రామింగ్ చేసేవాడు ,DOS ఐడియా కూడా IBM లాబ్స్ దే అంటారు ,బిల్ గేట్స్ నైస్ గా ఎకౌంటు లో వేసాడు , గేట్స్ ఆపిల్ కంప్యూటర్ లకి DOS ఇస్తాను అని చెప్పి స్టీవ్ జాబ్స్ నుండి Mac OS GUI కాజేశాడు , దానితో విండోస్ OS GUI తయారు చేసాడు , విండోస్ కెర్నల్ ,షెల్ లో చాలా వరకు మైక్రోసాఫ్ట్ సొంత ఐడియా లే ,పరమ బగ్గీ కోడ్ మరి , ;) , మైక్రో సాఫ్ట్ కోర్ టీం చాలా బాగుండేది ,ఎవరేమి చేసినా వీల్ ని మళ్ళి కొత్తగా invent చేయ్యనక్కర లేదు ,ప్రస్తుతం మైక్రో సాఫ్ట్ ఎవరికీ అందనత్త ఎత్తుకు ఎదిగింది , మైక్రో సాఫ్ట్ ఒరాకిల్ డేటాబేస్ ను ముంచడానికి చేయని ప్రయత్నం లేదు ,తరువాత java మీద పోరాటం లో సన్ మైక్రో సిస్టమ్స్ మీద పోరాటం చేసింది , డాట్ నెట్ తీసుకొని వచ్చారు , అప్పుడు ఒరాకిల్ మైక్రో సాఫ్ట్ కి వ్యతిరేఖ పోరాటం లో సన్ మైక్రో సిస్టమ్స్ కి హెల్ప్ చేసింది ,చివరికి సన్ మైక్రో సిస్టమ్స్ ని ఒరాకిల్ టేక్ ఓవర్ చేసి ఒరాకిల్ ముంచింది ;) ,అదే ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ కి అతి పెద్ద దెబ్బ ,దానినే అతి తెలివి తేటలు అని కూడా అంటారు , ఇప్పుడు కొత్త JDK రిలీజ్ కావడం లేదు ,JSR లు లేవు ,మొత్తం సంక నాకించే పనిలో పడింది ఒరాకిల్ , మైక్రో సాఫ్ట్ తరువాత గూగుల్ ను ముంచడానికి చెయ్యని ప్రయత్నం లేదు ,బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి బింగో తెస్తే అది మైక్రో సాఫ్ట్ ని ఒంగో పెట్టింది , అప్పడు ఆపిల్ గూగుల్ కి సప్పోర్ట్ గా ఉండేది ,వాళ్ళతో కలిసి పోరాటం చేసింది , ఆపిల్ తరువాత వాళ్ళ app store ని పబ్లిక్ కి ఓపెన్ చేసి iOS ని డెవలప్మెంట్ కోసం ఇవ్వడం మొదలు పెట్టారు ,గూగుల్ కూడా PC లని కాకుండా టాబ్లెట్ ,మొబైల్ మార్కెట్ కోసం ఆండ్రాయిడ్ OS తెచ్చింది , OS ఫ్రీ అని చెప్పి అన్ని non apple డివైస్ లకి ఉచితంగా ఇవ్వడం మొదలు పెట్టింది ,గూగుల్ వాళ్లకి కూడా ఇప్పడు google play అనే గేమ్ స్టోర్ పెట్టారు ,ఇప్పుడు కామెడి ఏమిటో తెలుసా , ఒక నాటి మిత్రులు అయిన ఆపిల్ ,గూగుల్ లు అతి పెద్ద రైవల్స్ మార్కెట్ లో , ఇప్పుడు గూగుల్ మోటారోల ని పేటెంట్ ల కోసమే కొనేసింది , మొబైల్ మార్కెట్ లీడర్ అవ్వాలని తెగ ట్రై చేస్తుంది ,వీళ్ళని చూసి మైక్రో సాఫ్ట్ కూడా టాబ్లెట్ మార్కెట్ లలో వాటా కోసం సరి కొత్త OS తయారు చేసింది ,వాళ్ళు కూడా ఒక స్టోర్ స్టార్ట్ చేసారు , మధ్యలో గూగుల్ వాళ్ళు ఫేస్బుక్ ని కొట్టడానికి చేయని ప్రయత్నం లేదు ,ఆర్కుట్ ని కొని దానిని ముంచారు ,గూగుల్ ప్లస్ ని చాలా ఎక్కువ ఖర్చు పెట్టి స్టార్ట్ చేసారు ,ఎన్ని చేసినా ఫేస్బుక్ ని ఏమి చెయ్య లేకపోయారు ,మధ్యలో బ్రౌజరు వార్ లు కూడా జరిగాయి ఆండోయ్ , ఓపెన్ సోర్స్ మోజిల్లా వాళ్ళ ఫైర్ ఫాక్స్ ,గూగుల్ వాళ్ళ క్రోమ్ ,మైక్రోసాఫ్ట్ వాళ్ళ IE , ఆపిల్ వాళ్ళ సఫారి ఒకడిని ఒకడు ముంచడానికి చెయ్యని యుద్ధం లేదు , ఫ్రీ ఈమెయిలు మీద కూడా ఇంతకు రెట్టింపు యుద్ధాలు జరిగాయి ,దీనిని బట్టి మనకి అర్ధం అయ్యింది ఏమిటి అంటే రాజకీయాలలో లాగే టెక్నాలజీ కార్పోరేట్ వరల్డ్ లో కూడా శాశ్వత మిత్రులు ,శాశ్వత శత్రువులు ఎవరూ లేరు ,ఇంకొన్ని విశేషాలు మరెప్పుడన్నా చెప్పుకుందామే
Posted on: Tue, 27 Aug 2013 04:03:10 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015