ఈమధ్య చాలామంది నాకు ఈ - TopicsExpress



          

ఈమధ్య చాలామంది నాకు ఈ ప్రశ్న వేశారు. మీరు కూరగాయలని కోసుకుతింటే తప్పులేనిది, మేము మాంసం తింటే తప్పు ఏంటి అని అడిగారు. దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు కొన్ని నియమాలు విధించి ఇవి వీరు తినండి, ఇవి వీరు తినండి అని విభజించి ఇచ్చాడు. పిల్లి ఎలుకని, పులి లేళ్ళని, ఇలా చిన్న చిన్న జంతువులని పెద్ద జంతువులకి ఆహారంగా ఇచ్చాడు. పులి వచ్చి గడ్డి తినమంటే తినదు. ఇది సహజగుణం. అలాగే కూరగాయలు, కందమూలాలు, తోటకూర, పాలకూర, చిక్కుడు, కొన్ని రకాల దుంపలు, కొన్ని రకాల ఫలములు ఇలా కొన్నిటిని మానవుడికి ఇచ్చాడు. మానవుడికి దీనితోపాటు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగే జ్ఞానాన్ని ఇచ్చాడు. వీటితోపాటు వేదాలు ఇచ్చాడు. కాని ఇవన్ని మరిచిపోయి జ్ఞాన శూన్యుడు అయ్యి, వేదాలని పరిత్యజించి(వదిలేసి) మూర్ఖత్వంతో బ్రతికేస్తున్నాడు. గడ్డి తినే ఆవు తన బిడ్డకి పాలు ఇచ్చిన తరువాత మనకి సరిపడా పాలు ఇస్తుంది. ఎందుకు? బిడ్డకి ఇవ్వలేక? గడ్డితినే మేక అవలీలగా కొండలు ఎక్కేస్తుంది. అది మాంసాహారం తింటుందా? ఏనుగు శాకాహార జీవి. దీనికి ఎక్కడనుంచి వచ్చింది ఇంత బలం.? ఇక అసలు విషయానికి వద్దాం. కూరగాయలు కోసి మనం వండుకు తింటున్నాం అని నేరం మోపుతూ మాంసాహారం తినొచ్చు అని వితండవాదం చేస్తున్నారు. మాంసాహారం తినాలంటే ముందుగా చేసే పని ఒక జీవి ప్రాణం తీయడం. ఆ జీవి ఎక్కడినుండి ఎలా వచ్చింది? శుక్రకణ నిర్మిత శరీరం, ఒక అడ ఒక మగ సంభోగం ద్వార సృష్టి జరిగి మల, మూత్ర విసర్జితాలతో వచ్చింది. ఇది సృష్టి నుండి ఆవిర్భవించిన మరో సృష్టి ద్వార సృష్టి క్రమంలో వచ్చింది. మరి కూరగాయలు. వీటిని తినాలంటే మనం కేవలం కాయని మాత్రమే కోస్తున్నాం. చెట్టుని చంపం. చంపగలిగే చెట్లు కొన్ని ఉదాహరణకి అరటి. దీనిని చంపకపోతే మరో గెల పండదు. మనం తినే ఏ కూరగాయ అయినా చంపగలిగే పనిలేదు. అలాగే ఒక మగ చెట్టు అడ చెట్టు సంభోగం జరిగే అవకాశమే లేదు. చెట్టు ఎప్పుడూ సూర్యరశ్మి ద్వార, భూమిలో ఉన్న లవణముల ద్వార మాత్రమే తన ఆహారాన్ని తనే స్వయంగా తాయారు చేసుకుంటుంది. ఇందులో హింస లేదు. ఒక మామిడి పండు కావాలంటే చెట్టు కొట్టాలా?అవసరం లేదు. కాయ కోసి తినవచ్చు. మరి మాంసాహారం?
Posted on: Thu, 05 Sep 2013 11:40:59 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015