మనుషుల్ని ఎందుకు - TopicsExpress



          

మనుషుల్ని ఎందుకు స్మరించుకోవాలి? _______________________ తల్లి గర్భంలో శూన్యస్థితి నుండి మొదలైన మన జర్నీ ఏ మలుపులు తిరిగినా ఒక ఆకారం అంటూ లేని పరిస్థితులు వాటికి కారణం అని చెప్పుకుంటూ తిరుగుతాం లేదా అది మన గొప్పదనంగా డప్పు కొట్టుకుని మరీ ఊరేగుతాం గానీ... ఎంతమంది ప్రాణప్రదంగా మనల్ని తమ ఆలోచనల ద్వారా కాపాడుతూ వచ్చారో, మన ఉన్నతికి దోహదపడుతూ వచ్చారో అస్సలు ఆలోచించం. యెస్.. మనం బాగుండాలని అందరూ కోరుకుంటారు... ఇది నిజం. కానీ మనం నాశనం అవ్వాలని అందరూ కోరుకుంటున్నారన్నంత ఇన్‌సెక్యూర్డ్‌గా బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఎవర్నీ లెక్క చేయం, తలఎగరేస్తాం, పక్కోడిని శత్రువులా చూస్తున్నాం. మనిషీ మనిషీ బ్రతికే కొన్నేళ్లు కత్తులు నూరుకునీ, ద్వేషించుకునీ సాధించేదేముంది? అలా ద్వేషించే వాళ్ల గురించి మనం ఆలోచించినంత మనల్ని ప్రేమించే వాళ్ల గురించి, అభిమానించే వాళ్ల గురించి ఎందుకు ఆలోచించం? ------------- ప్రతీ రిలేషన్‌నీ take for grantedగా అతి సాధారణంగా తీసుకోవడం వల్ల మనుషులకు రిలేషన్ల మీద నమ్మకం పోతోంది. ఒక మనిషి గురించి ఎంత ఆలోచించినా కనీసం ఆ మనిషికి కృతజ్ఞత కూడా లేకుండా పోతోందే అన్న నిర్లిప్తత కొద్దీ మనుషుల్ని అసహ్యించుకుంటూ పోతున్న జనాలు ఎక్కువయ్యారు. సో మన జీవితంలో ఏదో రూపంలో role పోషించిన వాళ్లని గుర్తుంచుకోవడం మన బాధ్యత కాదా? --------------- నావరకూ నేను ప్రతీ ఒక్కళ్లనీ నిశితంగా గమనిస్తుంటాను. ప్రతీ వ్యక్తిలో ఏదో ఒక గొప్ప క్వాలిటీ నాకు కన్పిస్తుంది. అబ్బా.. ఈ మనిషిలా ఆలోచించగలిగితే.. ప్రవర్తించగలిగితే ఎంత బాగుణ్ణు అనుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. కొందరు చాలా కష్టపడతారు, కొందరు చాలా ప్రేమగా ఉంటారు, కొందరి చెంత సమయమే తెలీదు, కొందరు చాలా డెడికేటెడ్‌గా ఉంటారు,కొందరు చాలా ఇన్‌స్పైర్ చేస్తారు, కొందరు తాము బాధపడుతున్నా మనకు ఆనందం పంచుతుంటారు, కొందర్ని చూస్తే జీవితంపై చాలా భరోసా వస్తుంది, కొందర్ని చూస్తే మనమెందుకు మనుషులకు సాయపడలేకపోతున్నాం, మనం స్వార్థపరులం అన్పిస్తుంది. మనలో ఉండే ఇన్ని రకాల బలహీనతలను సరిదిద్దుకుని, తెలియని క్వాలిటీస్‌ని నేర్చుకునీ పరిపూర్ణ వ్యక్తిగా ఎదగడమే జీవితంగా అన్పిస్తుంది నాకు! అంతే తప్పించి కొద్దో గొప్పో ఏదో ఫీల్డ్‌లో కొంత సాధించేసి.. చాలా ఎదిగిపోయినట్లు భ్రమపడిపోతూ ప్రతీ మనిషిలోని లోపాలనూ ఎగతాళి చేస్తూ మనం గొప్పోళ్లుగా చలామణి అవ్వడం మనం మనిషిగా పతనమవడంతో సమానం. మనుషులే మనకు బలం వాళ్ల నుండి నేర్చుకోగలిగితే.. వాళ్ల దగ్గర వినయంగా ఒదిగిపోతే! మనుషులే మనకు బలహీనత.. వాళ్లని తిరస్కరిస్తే.. అన్నీ మనకే తెలుసని విర్రవీగిపోతే!! నాకు మనుషులు కావాలి.. నేను ఏం చేసినా ఈ మనుషులకే చేయగలను ఈ ప్రపంచంలో..! అలాగే నేను ఏ ప్రేమని పొందినా మనుషుల ద్వారానే పొందగలుగుతాను. సో అందుకే నాకు మనుషులంటే చాలా చాలా ఇష్టం. సో ఇష్టమైన వ్యక్తుల్ని కనీసం జీవితంలో ఒక్కసారైనా స్మరించుకోపోతే ఇంకెందుకు ఈ లైఫ్? - నల్లమోతు శ్రీధర్
Posted on: Sun, 06 Jul 2014 13:11:47 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015